Malapalli oka paramarsha
Editor · Novels

Price: Rs. 180. "మాలపల్లి - ఒక పరామర్శ" గ్రంథరచయిత శ్రీ గురజాల ఆంజనేయులు నాయుడు గారు, ఈయన చిత్తూరు జిల్లావాసి, బంగారుపాళెం మండలంలోని తంబుగానిపల్లె గ్రామంలో 1938 ఆగస్టు రెండున జన్మించారు. శ్రీమతి రంగమ్మ. శ్రీ కృష్ణమనాయుడు వీరి అమ్మా నాన్నలు. వీరిది వ్యవసాయ కుటుంబం. తంబుగానిపల్లెలో ప్రాథమిక విద్య, చిత్తూరు పట్టణంలో హైస్కూలు విద్య అభ్యసించారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ, పియుసి, బి.ఏ. ఎం.ఏ ప్రైవేటుగానే చదువుకున్నారు. మదనపల్లి బి.టి.కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేశారు. ప్రసిద్ధ అభ్యుదయ రచయిత, విమర్శకుడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారికి ఆంజనేయుల నాయుడు గారికి మంచి స్నేహం, ఆంజనేయులు నాయుడుగారు తన గ్రామనికే చెందిన శ్రీమతి జీవరత్నమ్మను పెళ్లి చేసుకున్నారు. తన విద్యార్థులకు నాన్డీటైల్డ్ అంశంగా 'మాలపల్లి' నవలను బోధించే క్రమంలో ఆంజనేయులు నాయుడు గారికి ఆ నవల మీద మక్కువ కలిగింది. ఆధ్యాపకుడుగా పనిచేస్తూ, యుజిసి వారి ఫాకల్టీ ఇంప్రూవ్మెంటు పథకం ద్వారా శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ పరిశోధన చేశారు. ఈ పరిశోధన గ్రంథం ఒక నవలను ఎన్ని రకాలుగా పరిశీలించవచ్చునో భావి పరిశోధకులకు నేర్పుతుంది.