Malapalli

Editor · Best Selling

Malapalli book cover

Price: Rs. 360. వాడుకభాషలో పుస్తకం వ్రాయడానికి నాకిదే మొదటి ప్రయత్నం. మాదిరికి తగిన గ్రంథములుకూడా లేవు. సంస్కృతభాషా పాండిత్యంగాని తెలుగు ప్రబంధముల పరిచయంగాని వాడుకభాషలో గ్రంథములు వ్రాయడానికి విశేషం తోడ్పడవు. శుద్ధమయిన తెలుగుభాష రావడానికి సంస్కృతభాషతో సంబంధంలేని పల్లెటూరివారితో పరిచయముండాలి. మొదట సంస్కృత పండితులూ, ఇప్పు డాంగ్లభాషా పండితులూ తెలుగుభాషయొక్క స్వభావాన్నిమార్చారు. అనేక భావాలను తెలియజేసే అచ్చ తెలుగుమాటలున్నా సంస్కృతమునుంచో, ఇంగ్లీషునుంచో మాటలరువు దీసుకోవడం మామూలయింది. అందువల్ల చక్కని తెలుగు మాటలన్నీ మూలబడి భాషలో సాంకర్యమెక్కువయింది. వీలయినంతవరకు తెలుగుభాషయొక్క నడక కనుకూలంగా యీ గ్రంథం వ్రాయడానికి ప్రయత్నం జేశాను.

Browse more Telugu books