Mahilala Uddarana
Editor · Politics

Price: Rs. 72. విప్లవ కార్యకలాపాలు నిర్వహించే క్రమంలో లెనిన్ శ్రామిక మహిళల ఉద్ధరణ గురించీ, కార్మిక, కర్షక మహిళల ఉద్దరణ గురించి తరచుగా రాశాడు, తన ఉపన్యాసాలతో మాట్లాడాడు. కార్మిక హితం కొరకు, సోషలిజం కొరకు జరిగే పోరాటంతో స్త్రీల ఉద్ధరణ విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. శ్రామిక ప్రజల నాయకుడిగా, పార్టీ, సోవియెట్ ప్రభుత్వ ఆర్గనైజరుగా యెధుడుగా, నిర్మాతగా లెనిన్ మనకు తెలుసు. శ్రామిక మహిళల స్థితిని గురించి వాళ్ళ ఉద్దరణ గురించి లెనిన్ చెప్పినదానికి పరిమితం కాకుండా, ప్రతి కార్మిక మహిళా, ప్రతి రైతు మహిళా ఆయన చేసినదంతా, ఆయన కార్యకలాపాలనన్నిటినీ తెలుసుకోవాలి. కానీ, మొత్తం కార్మికవర్గ పోరాటానికీ, స్త్రీల స్థితిని మెరుగుపరచడానికీ మధ్య అత్యంత గాఢమైన సంబంధం వుంది గనుక, లెనిన్ తన ఉపన్యాసాలలోనూ, వ్యాసాలలోనూ ఈ సమస్యను తరచుగా - వాస్తవానికి, నలభై పై చిలుకు సందర్భాలలో ప్రస్తావించాడు; మహిళల ఉద్దరణ గురించి లెనిన్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ పుస్తకంలో చదవగలరు.