Mahatma Jyotirao Phule
హారతి వాగీశన్ / Harathi Vageeshan · Books

Price: Rs. 28. హంటర్ కమీషన్కు ఫూలే సమర్పించిన విజ్ఞాపన, పండిత రమాబాయి మతమార్పిడీ, బ్రహ్మ సమాజికుల వంటి బ్రాహ్మణ ప్రధాణ సంస్కరణల గురించి రాసిన సత్సార్ (సత్యసారం) సంచికలు, మరాఠీ సంస్కర్తల్లో ప్రముఖుడైన రణడే వ్యాఖ్యలపై హేతుబద్ధమైన విమర్శలు ఎక్కుపెట్టిన చేతావని (హెచ్చరిక), మరాఠీ రచయితల సంఘపు ఆహ్వానానికి జవాబు, బ్రహ్మణీయ విలువలు ప్రధానంగా ఉండే విద్యా విధానం మీద విసుర్లతో రాసిన పాట సారాంశం. బాల్య వివాహాలు, బలవంతపు వైదవ్యం సమస్యను గురించి బెహ్రామ్ మల్ బారీకి సమర్పించిన పత్రం ఈ సంపుటిలో ఉన్నాయి. స్త్రీలు, రైతులు ఎదుర్కొనే సమస్యలను తడిమి, బ్రాహ్మణీయ కుటిల సంస్కరణల స్వరూపాన్ని చూపి జ్ఞాన వికాసానికీ, బహుజనులకూ విద్య ఎంత అవసరమో నొక్కి చెప్పిన తీరు ద్వారా జ్యోతిబాలోని భావ ప్రసార సామర్థ్యాన్ని, సంవాదం-సంభాషణ (Argumentation and Dialogue) రూపంలో రచనలకుండే బలాన్ని ఇందులో మనం చూడవచ్చు. అనువాదకులు హారతి వాగీషన్ మహబూబ్నగర్ జిల్లా ఖిల్లాఘన్పూర్కు చెందిన రాజనీతి శాస్త్ర విద్యార్థి. ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సంస్థలో పంచాయితీరాజ్ సంబంధ విభాగంలో పని చేస్తున్నారు.