Mahatma Jyothiba Pule Jeevitham-Udhyamam

Editor · History

Mahatma Jyothiba Pule Jeevitham-Udhyamam book cover

Price: Rs. 180. ఆధునిక భారత చరిత్రలో మహాత్మునిగా బిరుదు పొందిన వ్యక్తులు యిరువురే. ఒకరు మహాత్మ గాంధీ, మరొకరు మహాత్మ జోతిబా ఫూలే. వరుసక్రమంలో చూస్తే ఫూలే ముందుగా అటువంటి బిరుదునందుకున్నాడు. దురదృష్టవశాత్తూ గాంధీ గురించి వచ్చినన్ని రచనలు, జరిగినన్ని పరిశోధనలు ఫూలే గురించి జరగలేదు. భారతీయ సామాజిక పునరుద్ధరణ, సాంస్కృతిక పునరుద్ధరణ ఉద్యమానికి పితామహునిగా చరిత్ర పుటలకెక్కిన రాజా రామ్మోహన్రాయ్ కంటే ముందే జోతిబా ఫూలే ఈ బాట పట్టాడు. చరిత్రను చరిత్రగా పరిశీలిస్తే రామ్మోహనరాయ్ చేసిన కృషి కంటే జోతిబా ఫూలే కృషి వేయి రెట్లు ఘనమైనది. రామ్మోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహనీయులు ప్రధానంగా ఆదిపత్య కులాలను ఆధునికత వైపు నడిపించేందుకు కంకణం కట్టుకుంటే జోతిబాఫూలే ఆధునికత కుసుమాలు పీడిన కులాల పెరట్లో పూయించేందుకు జీవితం అంకితం చేశాడు. ఈ పోలికను స్వాగతించటం అంత తేలికైన పని కాదు. జోతిబా ఫూలే చరిత్ర, సామాజిక ఉద్యమాలకు ఆయన అందించిన చేయూత, చేసిన దిశానిర్దేశం గురించి భారతదేశంలోనే ప్రాంతీయ భాషల్లో సాహిత్యం అందుబాటులోకి రావటం ఎంతో క్లిష్టమైన వ్యవహారంగా మారింది. జాతీయోద్యమ వారసత్వం లేదా వలసవాద వ్యతిరేక విముక్తి ఉద్యమ వారసత్వం భారతీయులందరిదీ అని సగర్వంగా మనం నెమరు వేసుకుంటున్నా ఈ వారసత్వం పేరుతో మనం తెలుసుకుంటున్న చరిత్రలో అణగారిన కులాలు, వెనుకబడిన తరగతులు, వర్గాల చరిత్ర నామమాత్రమే. ఆయా నిమ్నకులాలు, వర్గాలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల గురించిన సమాచారం కూడా నామమాత్రమే అంటే అతిశయోశక్తి కాబోదు.

Browse more Telugu books