Mahasweta Devi Kathalu

Editor · Stories & Poetry

Mahasweta Devi Kathalu book cover

Price: Rs. 345. "భారతదేశ జనాభాలో అత్యంత నిర్లక్ష్యానికీ, నిరాదరణకు గురైన వర్గం ఆదివాసీలు. నేను వీరికి సంబంధించిన కఠోర వాస్తవాలను దేశం దృష్టికి తేవాలనుకున్నాను. విస్మరణకు గురై, మరుగునపడిన వీరి చరిత్రను అధికారిక చరిత్రలో చేర్చాలన్నదే నా తపన, నేనెన్నో సార్లు చెప్పాను- మన స్వాతంత్ర్యం వట్టి బూటకమని, ఈ వంచిత జనానికి అసలు స్వాతంత్ర్యమనేదే లేదు. నేటికీ కనీస ప్రాథమిక హక్కులు లేని ప్రజలు వీళ్లు" (ఎ రైటర్స్ టెస్టమెంట్ ఆఫ్ ఫెయిత్ 2010) "మన చరిత్రను తప్పనిసరిగా తిరగరాయాలి. బ్రిటీషు కాలంలోనూ, అంతకు పూర్వం కూడా భారతదేశ ప్రధాన స్రవంతి పోరాటాల్లో ఆదివాసీలు నిర్వహించిన పాత్రకు సముచిత స్థానం కల్పించాలి. వాళ్ల పోరాటాల చరిత్ర చిఖిత పత్రాల్లోనే కాదు... తరతరాలుగా వస్తున్న వాళ్ల పాటలూ, సృత్యాలూ, జానపద కథల్లో కూడా ఉంది." (డస్ట్ ఆన్ ది రోడ్) "నా ప్రజలు ఇప్పటికీ ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. భూమిలేకపోవటం, అప్పులు, వెట్టిచాకిరీ వంటి సమస్యలతో నిత్యం కునారిల్లుతున్నారు. ఈ దుర్భర పరిస్థితుల నుంచి వారిని విముక్తుల్ని చేయడంలో విఫలమైన ఈ వ్యవస్థ పట్ల నాలో రగిలిపోతున్న అసహన, ఆగ్రహ జ్వాలలే నా రచనలకు ఏకైక ప్రేరణ. వామపక్షాలతో సహా పార్టీలన్నీ సామాన్యులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఈ నిబద్ధతా రాహిత్యం నన్ను తీవ్రమైన అవేదనకూ, అశాంతికి గురి చేస్తోంది. ఈ ఆక్రోశం, అపరాధ భావనల నుంచి నన్ను నేను బయటపడేసుకునేందుకు- నేను రాయక తప్పుడు!" ('రైటింగ్ యాజ్ సోషల్ సర్వీస్' 2011)

Browse more Telugu books