Mahaneeyula Manchi Maatalu

P. RAJESWARA RAO / పి. రాజేశ్వర్ రావు · Literature

Mahaneeyula Manchi Maatalu book cover

Price: Rs. 144. “సూక్తి - అనుభవానికి పుట్టిన శిశువు". ఎందరో ప్రముఖ నాయకులు, ఉపాధ్యాయులు, మేధావులు, రచయితలు, విజ్ఞానవేత్తలు వారి జీవితానుభవసారాన్ని ఆర్యోక్తులుగానూ, మరువరాని మాటలుగానూ, సూక్తులుగానూ, హితోక్తులుగానూ చెప్పిన మంచి మాటలను పత్రికల ద్వారా, ఎన్నో పుస్తకాల ద్వారా, వ్యక్తులద్వారా సేకరించి సరళమైన భాషలో, సులభశైలిలో అకారాది క్రమంలో దాదాపు 3000 సూక్తులను, హితోక్తులను, జీవిత సత్యాలను ఈ పుస్తకం ద్వారా మీకందిస్తున్నాను. పుస్తక విస్తరణ భీతివల్ల మంచిమాటలు చెప్పిన వారి పేర్లను కొన్నింటికి మాత్రమే యిచ్చాను. ఇందులోని ఆర్యోక్తులు (పెద్దల మాటలు) మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు మార్గదర్శకాలు. మానసిక ప్రశాంతతకు శాంతిదూతలు. మన వ్యక్తిత్వ వికాసానికి సూత్రాలు, మీ విజయాలకు నిచ్చెనలు. సమాజంలో హింస, అవినీతి, అన్యాయం, అశాంతి, అశ్రద్ధ, సోమరితనం, అక్రమార్జన పెరిగిపోతున్న ఈ రోజుల్లో శాంతి, విజయం, ధైర్యం, సహజీవనం, క్రమ సంపాదన, పనిపట్ల శ్రద్ద మొదలైన సుగుణాలు ప్రజల్లో పెరిగేలా చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీదా వుంది. మంచి చెడులను తెలుసుకుని సరైన అవగాహన పెంచుకొని సన్మార్గంలో వెళ్లేందుకు ఇందులోని సూక్తులు, హితోక్తులు, జీవన సత్యాలు నిస్సందేహంగా ఉపయోగపడతాయి. సమాజంలో మంచిని కోరే వారందరూ ముఖ్యంగా ఉపాధ్యాయులు, నాయకులు, పండితులు, మేధావులు ఈ మంచి మాటలను వారి ప్రసంగాల ద్వారా వినిపిస్తే సమాజంలో మంచిని పెంచినవారవుతారు. ఈ పుస్తకం కొద్దిమందినైనా, వీసమైనా, మంచివైపుకు మళ్ళిస్తుందని ఆశిస్తూ... సెలవిప్పటికి - స్నేహమెప్పటికీ....

Browse more Telugu books