Mahakavi Sri Sri - Antaratma
సవ్వప్పగారి ఈరన్న / Savvappagari Eeranna · Biographies & Auto Biographies

Price: Rs. 95. తెలుగు అక్షర రక్షకుడు, తెలుగు సాహితీ సేవకుడు, సకల సాహితీ ప్రక్రియల సమున్నతుడు సవ్వప్పగారి ఈరన్న. సాహిత్యమే శ్వాసగా, సాహిత్యసేవే ధ్యాసగా తన జీవితాన్ని ఆసాంతం రచనలకే అంకిత మిచ్చిన ధన్యజీవి. 74 సం||ల అలుపెరగని హృద్యకవి ఈ వృద్ధకవి. ఈయన స్వార్థమెరుగని నిస్వార్థ సేవకుడు. తాను స్థాపించిన "కమలా కళానికేతన్ సాహితీ సంస్థ" ద్వారా సాహిత్య కార్యక్రమాలను వివిధ ప్రాంతాలలో విరివిగా నిర్వహించి, కవులను, కళాకారులను తగు రీతిలో ప్రోత్సహిస్తూ, వారిని సముచిత రీతిలో గౌరవిస్తూ వస్తున్నాడు. తన 74 వసంతాల అమృతోత్సవాల సందర్భంగా తీసుకువచ్చినదే ఈ "మహాకవి శ్రీశ్రీ - అంతరాత్మ". ఇది తన 70వ గ్రంథం. ఇందులో శ్రీశ్రీ జీవితంలోని అన్ని పార్శ్వాలనూ స్పృశించాడు రచయిత. శ్రీశ్రీ బాల్యం, విద్యాభ్యాసం, రచనారంగం, సినిమా రంగం సాధక బాధకాలు, అంతిమదశ ఇత్యాది అంశాలన్నీ ఒక క్రమ పద్ధతిలో పొందుపరిచాడు. ఈ గ్రంథాన్ని ఒక పరిశోధనా గ్రంథంగా భావించవచ్చు. పాఠకు లందరూ పఠించదగిన పటిష్టమైన విశిష్ట గ్రంథం. ఈ గ్రంథాన్ని ఆదరిస్తే ఈ రచయితను ఆదరించినట్లే. ఈయన అనుభవాల పేటిక నుండి మరికొన్ని అమూల్యమైన, ఆసక్తికరమైన రచనలు వెలువడి, పాఠకుల చెంతకు చేరాలని అభిలషిస్తూ.