Mahabharatham

Editor · History

Mahabharatham book cover

Price: Rs. 180. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటాం సూర్యోదయాన్ని. అది సూర్యోదయపు అందం ... అది సూర్యోదయపు అవసరం. మహాభారతమూ అంతే ! అచ్చం సూర్యోదయం లాంటిదే. అసలు భారతం అంటేనే ప్రకాశమని అర్థం. అందుకే వేల సంవత్సరాలుగా ఎందరో కవులూ రచయితలూ మహాభారత రచనను చేస్తున్నా ఈనాటికీ నిత్యనూతనంగా ఇంకా దాని ప్రతిధ్వనులు వస్తూనే ఉన్నాయి. దేని అందం దానిదే... దేని సందేశం దానిదే.. మహాభారతాన్ని చదివి మైమరచిపోని వారూ దాని వల్ల జీవితాన్ని చక్కదిద్దుకోని వారూ అరుదు. అందుకే ఏనాడో... కనీసం ఐదువేల సంవత్సరాల కింద జరిగిన ఒక భయంకర యుద్ధగాథను ఇంకా ఈనాటికీ భక్తితో సంతోషంగా స్మరించుకొంటున్నాం. మహాభారతం కేవలం దాయాదుల పోరుకాదు. మనిషి జీవన సంఘర్షణ. ధర్మాధర్మాల విచక్షణ. నెత్తుటితో తడిసిన జీవనవేదం. ఇది చదవని జీవితం నిస్సందేహంగా అసమగ్రం. ఈ జీవనవేదాన్ని సరళమైన తెలుగులో సమగ్రంగా సంక్షిప్తంగా అందించే యత్నమే ఈ రచన. రచయిత గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ పండిత వంశంలో జన్మించారు. గత ఇరవై సంవత్సరాలుగా వివిధ అంశాలలో రచనలు చేస్తున్నారు. తెలుగు సాహిత్య వ్యాసాల ప్రామాణిక సంకలనం 'సాహితీ సుధ' అనే బృహత్ గ్రంథానికి సహ సంపాదకత్వం వహించారు. సాహిత్యం, మనో విజ్ఞాన శాస్త్రాలు ఈయన అభిమాన విషయాలు. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సాపూర్, మెదక్ జిల్లాలో ప్రధానోపాధ్యాయులుగా విధులను నిర్వర్తిస్తున్నారు.

Browse more Telugu books