Maha vishwam-Mana Bhumi

S.Venkatrao · Education & Science

Maha vishwam-Mana Bhumi book cover

Price: Rs. 75. అనాదిగా ప్రకృతిపై విజయం సాధించడానికి మానవులు చేసిన పోరాటం, ఆధునిక విజ్ఞానశాస్త్రం అభివృద్ధికి అనేక మంది శాస్త్రవేత్తలు చేసిన కృషి, సాగర గర్భంనుండి అంతరిక్షం అంచుల వరకు అన్ని ప్రదేశాలనూ చేరుకోవాలన్న తపనతో పలువురు యోధులు సాగించిన సాహస యాత్రల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఆధునిక శాస్త్ర, సాంకేతిక సౌకర్యాలు. ఆ పోరాటంలో, కృషిలో, సాహసయాత్రల్లో లెక్కలేనంతమంది తమ ప్రాణాలను బలిదానం గావించారు. అంతరిక్షాన్ని జయించడానికి జరిగిన కృషిలో కూడా అనేకమంది అసువులు బాశారు. అటువంటి వారిలో మన భారత దేశ ఆడపడుచు కల్పనా చావ్ల ఒకరు. హర్యానాలోని కర్నాల్ పట్టణంలో - ఆడపిల్లలకు పెళ్లి మినహా మరో లక్ష్యం, ఆశయం ఉండకూడదనే భావాలు బలంగా ఉండే ప్రాంతంలో, కుటుంబంలో పుట్టి - పట్టుబట్టి ఏరోస్పేస్ ఇంజనీరింగు చదివి, అమెరికా వెళ్లి అక్కడ నాసా వారి కొలంబియా కార్యక్రమంలో చేరి రెండుసార్లు అంతరిక్ష యానంలో పాల్గొన్న కల్పన ఆ ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయారు. 2003 ఫిబ్రవరి ఒకటో తేదీన కొలంబియా భూవాతా వరణంలోకి ప్రవేశిస్తుండగా సాంకేతిక లోపాల వల్ల పేలిపోయి మరో ఆరుగురు వ్యోమగాములతోబాటు కల్పన కూడా కన్నుమూశారు. అంతరిక్షం లో మానవుని విజయపతాక ఎగురవేసే కృషిలో అసువులు బాసిన, భారత దేశ కీర్తి పతాకను సమున్నతంగా నిలిపిన సాహసనారి కల్పనా చావ్లకు ఆరవ ముద్రణకు వచ్చిన సందర్భంలో ఈ పుస్తకాన్ని అంకితమివ్వడం జరిగింది.

Browse more Telugu books