Maha Bhakthula Charitham
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి / Sripada Subrahmanyam Sastry · History

Price: Rs. 180. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గురించి యావద్భారతదేశమూ ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధారలక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలు అందుకున్న శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్తి - తూర్పుగోదావరి జిల్లా, పొలమూరులో 1891 ఏప్రిల్ 23న జన్మించారు. వేదం, జ్యోతిష్యం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు. శ్రీపాదవారు ప్రధానంగా కథా రచయిత. ఆ తర్వాత నవలా రచయిత, రూపకర్త. అనువాదాలు, వైద్యగ్రంథాలు కూడా రాశారు. వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండ లందించారు. గాంధీ-ఖద్దరు-హిందీ ఈ మూడింటినీ వ్యతిరేకించిన వ్యక్తి. తెలుగు కథకులలో 1956లోనే కనకాభిషేక గౌరవం అందుకున్న ప్రథములు. వీరు 1961 ఫిబ్రవరి 25న స్వర్గస్థులయ్యారు.