Magic (Telugu)
Editor · Personality Development

Price: Rs. 245. ఒక పదం అంతటినీ మార్చేస్తుంది ఇరవై శతాబ్దాలకు పైగా ఒక పవిత్ర గ్రంథంలోని కొన్ని పదాలను చదువరులందరూ అపార్థం చేసుకున్నారు. ఆ పదాలు వారిని గందరగోళపరిచాయి. చరిత్రలో కొంతమంది పాఠకులు మాత్రమే ఆ పదాలలో ఒక గూడార్థం వున్నదనీ, ఆ అర్ధాన్ని కనుక్కోగలిగితే మన కళ్ళముందు ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరిస్తుందనీ తెలుసుకున్నారు. "మ్యాజిక్"లో రోండా బర్న్ ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరిచింది. ఒక 28 రోజుల అద్భుతమైన సాధనతో ఆమె ఈ జ్ఞానాన్ని నిత్యజీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో మనకు బోధిస్తున్నది. మీరెవరైనా కానీ మీరెక్కడున్నాకానీ మీ ప్రస్తుత పరిస్థితులెలా వున్నా కానీ ఈ "మ్యాజిక్" మీ జీవితం మొత్తాన్ని మార్చివేస్తుంది.