Madi Vippina Charitra

టంకశాల అశోక్ / Tankasala Ashok · History

Madi Vippina Charitra book cover

Price: Rs. 270. ఈ పుస్తకం ఒక ప్రత్యామ్నాయ భారతీయ చరిత్ర పాఠం కాగలదు. నిమ్న వర్గాల దృష్టితో చరిత్ర రచన అవసరమని సబాల్టర్న్ థియరీ సూచిస్తున్నది. కాని అటువంటి రచన చేసేందుకు ఆ వర్గాలకు చెందినవారు ఎప్పుడూ ప్రయత్నించలేదు. - గెయిల్ ఓంవెట్ ఇది సమన్వయమైన రీతిలో విషయాలను బాగా చర్చించిన రచన. ప్రస్తుత దృక్పథంతో పూర్తిగా విభేదించే వర్గాల దృక్పథాన్ని ఆవేదనతో ఆర్ద్రతతో, లోతుగా చర్చిస్తుంది. అదే సమయంలో అది సరైన దృక్పథమని మనలను ఒప్పిస్తుంది. - ఉమా చక్రవర్తి ఈ రచన అనువాదం అనేక భారతీయ భాషలలో వెలువడవలసిన అవసరం ఉంది. వెలువడగలదని భావిస్తున్నాము కూడా. ఒక కొత్త సమాజ నిర్మాణానికి తగిన ఆలోచనల కోసం అన్వేషిస్తున్న పోరాట ప్రజలకు ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. - మెయిన్ స్ట్రీమ్ పత్రిక సంప్రదాయానికి భిన్నమైన ఇటువంటి గ్రంథం, మన వాదనకు ఎంతగానో అవసరమైన పదునును తెచ్చిపెడుతుంది. అది ఒక కొత్త వాదనకు దారితీస్తుంది. పరిశోధనలు కూడా దీనివల్ల పూర్తిగా ఒక కొత్త మలుపు తీసుకోవచ్చు. - సమ్మర్ హిల్, ఐఐఎఎస్ రివ్యూ

Browse more Telugu books