Madhyayuga Andhradesamlo Vanijya Jeevanam
జనప వెంకట రాజం / janapa venkata rajam · History

Price: Rs. 95. తెలుగువారి చరిత్ర, సంస్కృతుల గురించి గత శతాబ్దికాలానికి మించి అనేక పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. కొన్ని సుప్రసిద్ధులైన చరిత్రకారులు రచించినవి, మరికొన్ని అంతే ప్రసిద్ధులూ సాహిత్యకారులైన పండితులు రచించినవి. విశ్వవిద్యాలయాలలో కూడా గణనీయమైన పరిశోధన జరిగింది. ఈ విద్వాంసుల రచనలు కొన్ని ప్రచురితమయ్యాయి. పండితులు, చరిత్ర ప్రేమికులు ఈ గ్రంథాలను ఆదరించారు. మరికొన్ని రచనలు అలాగే అప్రచురితంగా ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 1976లో స్థాపితమై నాలుగు దశాబ్దాలు పూర్తి చేసికొని నిరంతరాయంగా తన కృషి సాగిస్తూంది. క్రమబద్ధంగా జరుగుతున్న వార్షిక మహాసభలలో పండితులు, పరిశోధక విద్యార్థులు సమర్పించిన పరిశోధన పత్రాల సంపుటాలను చరిత్ర కాంగ్రెస్ ప్రచురిస్తున్నది. దేశవ్యాప్తంగా విఖ్యాత చరిత్రకారులు ఈ సదస్సులకు అధ్యక్షులుగా వ్యవహరించారు. క్రీ.పూ. 5000 నుండి క్రీ.శ. 2000 వరకు తెలుగువారి సమగ్ర చరిత్ర-సంస్కృతులను ఎనిమిది సంపుటాలలో ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ప్రచురించే మహోద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. వందమందికి పైగా ప్రసిద్ధులైన చరిత్రకారుల కృషి ఫలితమిది. పరిశోధకులకు మార్గదర్శకంగా చరిత్రకాంగ్రెస్ ఒక ఆధార సామగ్రి సంపుటాన్ని కూడా ప్రచురించింది. గతంలో ప్రచురితమై ప్రస్తుతం అందుబాటులోలేని ముఖ్యమైన పరిశోధన పత్రాలు / మోనోగ్రాఫుల పునర్ముద్రణను అనువాదాలను ప్రచురించాలని చరిత్ర కాంగ్రెస్ తలపెట్టింది.