Madhuvanam / మధుకవనం

Srimati Mrudula / శ్రీమతి మృదుల · Stories & Poetry

Madhuvanam / మధుకవనం book cover

Price: Rs. 95. మనసు పులకరించినప్పుడో, మధుర భావాలు హృదయాన్ని పలకరించి నప్పుడో, వెన్నెల చల్లదనం, మల్లెల తెల్లదనం మనసు నిండి తన్మయత్వం ఆవరించి వ్రాసుకునే కవితలు నాలుగు రోజులు కూడా నిలబడకపోవచ్చు. భావాలు మాసిపోనూ వచ్చు. కానీ... మనసు కుతకుత ఉడికినప్పుడు, పరిపరివిధాల తల్లడిల్లినప్పుడు, మంచికోసం ప్రాకులాడినప్పుడు తట్టు కోకుండా వ్రాసే కవితలు మాత్రం ఖచ్చితంగా నాలుగు కాలాలపాటు నిలబడతాయి. కవిని నిలబెడతాయి కూడా. ఇందులోని కవితలు అచ్చంగా అలాంటివే. కవయిత్రి మృదుల తనదైన దృష్టికోణంతో, తండ్లాడిన మనసుతో సమాజాన్ని చూసి, శోధన చేసి తపనతో రాసిన కవితలు ఇవి. చాలా రోజులుగా నేను ఆమె కవితలను వివిధ పత్రికల్లో చదువుతున్నా. వాటిని ఒక్కచోట పోగేసి చదివాక ఆమెను అంచనా వేయడం మాత్రం సముద్రపు లోతును కొలవడమే అనిపించింది. అందుకు నిదర్శనంగా ఇందులో కవితలు విభిన్నమైనవి. ఒకదానికొకటి పోలిక లేకుండా వేరు వేరు వస్తువులను తీసుకొని తనదైన శైలితో కవిత్వీకరించబడ్డాయి. సరళమైన భాషతో, లోతైన పరిశీలనతో తీసుకున్న వస్తువును భిన్న కోణంలోనుండి ఆవిష్కరించిన తీరు హృద్యంగా ఉంది.

Browse more Telugu books