Madhupam / మధుపం

డి. కామేశ్వరి / D.Kameswari · Books

Madhupam / మధుపం book cover

Price: Rs. 135. 1962 నించి కథలు, నవలలు రాస్తున్న కామేశ్వరి యిప్పటికి సుమారు 300 కథలు (11 కథాసంపుటాలు), 21 నవలలు, ఒక యాత్రా విశేషాలు, ఒక కవితాసంపుటి ప్రచురించారు. అనేక పత్రికలలో ప్రచురించబడిన ఆమె కథలు పాఠకుల, విమర్శకుల మెప్పుని పొందాయి. ఆమె కథలు నవలలు చాలా కన్నడంలోకి, మూడు పుస్తకాలు తమిళం, ఒకటి హిందీ, ఒకటి ఇంగ్లీషు భాషలోకి అనువదింపబడి పుస్తకాలుగా వచ్చాయి. న్యాయం కావాలి, కోరికలే గుర్రాలైతే సిని మాలుగా వచ్చాయి. అరుణ, కొత్తనీరు, విధివంచితలు, అగ్నిపరీక్ష, ఎండమావులు, మనసున మనసై, జీవితం చేజారనీయకు మొదలైన 21 నవలలు వచ్చాయి. కాదేదీ కథకనర్హం, కాలాన్ని వెనక్కి తిప్పకు మొదలైన కథాసంపుటాలు స్త్రీల సమస్యల ఆధారంగా రాసినవి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆమెకి గృహలక్ష్మి స్వర్ణకంకణం, మాదిరెడ్డి సులోచన అవార్డు, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు యూనివర్సిటీ మూడు అవార్డులు, గోపీచంద్ అవార్డు, హూస్టన్లో జీవిత సాఫల్య పురస్కారం, అమృతలత జీవిత సాఫల్య పురస్కారం, న్యాయం కావాలి సినిమాకి ఉత్తమ కథగా 5 అవార్డులు అందుకున్నారు. ఆనాటి నుండి నేటి వరకు రచనకి సామాజిక ప్రయోజనం ఉండాలన్న ధ్యేయంతోనే రచనలు చేస్తున్నారు.

Browse more Telugu books