Madhigalu

Editor · History

Madhigalu book cover

Price: Rs. 360. భారతీయ సామాజిక చారిత్రక గమనంలో మాదిగలు, చర్మకారులుగా, మాతంగులుగా, అరుంధతీయులుగా, చమార్లుగా చెప్పబడ్డారు. వీరు తమ శ్రమ ద్వారా తోలు, లంద, డప్పు, చెప్పు, కళలు, సంగీతం, మానవ రక్షణ వంటి రంగాలలో శాస్త్రీయ విజ్ఞానానికి ప్రాణం పోసి నాగరికత నిర్మాతలుగా ముందు వరుసలో ఎలా ఉన్నారో ఈ పుస్తకం చెబుతుంది. చరిత్ర గర్భం నుండి జాంబవంతుడు, మాతంగుడు, బుద్ధుడు, అశోకుడు, హరళయ్య, సంత్ రవిదాస్, దున్న ఇద్దాసు, డా॥ బి.ఆర్. అంబేద్కర్, కానీరామ్ల వారసత్వ పరంపరలు మాదిగ జీవితాలలో మమేకమైన తీరును, క్రమాన్ని ఈ గ్రంథం పరిచయం చేస్తుంది సామాజిక, సాంస్కృతిక, మానవీయ ఉద్యమాలలో మాదిగల పాత్ర, దండోరా పోరాటం, మాదిగ కళలు, సాహిత్యం, మాదిగ ఉప కులాల సాంస్కృతిక వైభవం, తాత్వికత ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. మాదిగలు చేయాల్సిన సాంస్కృతిక, రాజకీయ ప్రత్యామ్నాయాలను సమగ్రంగా ఈ గ్రంథం విశ్లేషించింది. పరివర్తన ఆశించే వారందరూ చదవాల్సిన గ్రంథం. - ప్రొ- గోపని చంద్రయ్య జి.బి. పంత్ సోషల్ సైన్స్ ఇనిస్టిట్యూట్, అలహాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రం. కుల నిర్మూలనోద్యమాలు, దళత్ స్టడీస్, సాహిత్యంపై పరిశోధన మరియు బోధన చేస్తున్నారు. జర్మనీ, అమెరికా, ఐర్లాండ్, ఫ్రాన్స్ దేశాలలో పరిశోధన పత్రాలను సమర్పించటంతో పాటు, కులాంతర వివాహాలు, దళిత యువత, దళిత, దండోరా ఉద్యమాలు, బహుజన మహానీయులపై రచనలు చేస్తూ, సామాజిక చైతన్యం కోసం సత్యశోధక్, బహుజన హెరిటేజ్ యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్నారు..

Browse more Telugu books