Madhiga vari Charithra Modhati, Rendava Bhagam

Editor · History

Madhiga vari Charithra Modhati, Rendava Bhagam book cover

Price: Rs. 235. 'మాదిగ వారి చరిత్ర' ఒక పరిశోధన గ్రంథం. వాస్తవానికి ప్రతి అధ్యాయం ఆధారంగా ఒక థీసిస్ రాయగలిగినంత వస్తువును ఆయన సంక్షిప్తంగా పొందుపరి చారు. ఈ దేశానికి ఆర్యులు రాకముందున్న జాంబువ (జంబూ) ద్వీప విశేషాలు, ఆర్యుల రాక వల్ల వచ్చిన మార్పులు, వర్ణవ్యవస్థ ఏర్పడిన తీరు, త్రివర్ణ వ్యవస్థ చతుర్వర్ణ వ్యవస్థగా పరిణమించిన విధానం, కుల వ్యవస్థ రూపొందిన పద్ధతి, అస్పృశ్యతాదురాచారానికి వూపిరులూదిన పరిస్థితులు, చర్మకారులకు ఆర్యులు పెట్టిన పేర్లు, ఒకప్పుడు ఆర్యులతో సమస్థాయిలో రాజ్యాలు ఏలిన మాదిగల (జాంబువులు) చరిత్ర మొదలైన అనేక విషయాలను రచయిత ఈ గ్రంథంలో చరి ్చంచారు. దళితోద్యమాలను వివరించారు. ప్రతి అంశానికీ వేదవాఙ్మయం, పురాణేతిహాసాలూ, చరిత్ర గ్రంథాలూ, మతసాహిత్యం- ఇత్యాదుల నుంచి ప్రమాణాలు ఉదహరించారు. జిజ్ఞాసువులనే కాక సామాన్య పాఠకులను కూడా ఆకట్టుకుని, ఆలోచింపజేసి 2001 నుంచి 2016 వరకూ పది ముద్రణలు పొందిన విశిష్ట రచన ఇది. ఒక్కరోజులో 500కు పైగా కాపీలు అమ్ముడయ్యి ఎన్నో రికార్డులు సృష్టించిన విలువైన పరిశోధనాత్మక గ్రంధమిది. ఒక వాక్యంలో చెప్పాలంటే మాదిగవారి అస్తిత్వ, ఆత్మగౌరవ పతాకమే "మాదిగ వారి చరిత్ర" మాదిగ మూలాలను చరిత్రలోనుంచి వెలికితీసీ సమకాలీన సాధికారతకు మార్గం సుగమంచేసిన మహత్తర రచన ఇది. అంతేకాదు... మాదిగ చరిత్రపై పరిశోధన చేసే భావిచరిత్రకారులకు, స్కాలర్స్కు భవిష్యత్తులో ప్రధాన ఆధార గ్రంథంగా ఈ రచన నిలుస్తుంది.

Browse more Telugu books