Maatalu-Maarpulu

డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ / Dr. Budaraju Radhakrishna · Books

Maatalu-Maarpulu book cover

Price: Rs. 170. డా॥ బూదరాజు రాధాకృష్ణ గురించి 1932 మే 3న ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించిన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ 1965లో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్టిప్షన్ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. చీరాల వి.ఆర్.ఎస్. & వై.ఆర్.ఎస్. కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేసిన వీరు 1988లో తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. సెంట్రల్ యూనివర్శిటీ విజిటింగ్ ప్రొఫెసర్ గా వుండి 1990 నుండి దశాబ్ద కాలంపాటు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేశారు. కలం పడితే చాలు కదళీపాకంలా సాగిపోయే అక్షర తరంగాలు, పెదవి విప్పితే చాలు సాగర ప్రవాహంలా దూసుకువచ్చే వాక్ జలధి వీరి ప్రత్యేకత. తెలుగు, సంస్కృత భాషల్లో గట్టి పునాదితో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. తెలుగు భాషా మర్మాల గురించి సాధికారికంగా చెప్పగలిగేవారు. చిక్కుముడులు విప్పగలిగేవారు. ఆధునిక పత్రికల భాషను ప్రామాణీకరించిన ఘనత వీరిదే. తెలుగు లెక్చరర్గా వీరు ఎందరికో ఆదర్శ గురువు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా వీరి కృషి అనల్పం.

Browse more Telugu books