MAATALO MANASUNAI
Editor · Best Selling

Price: Rs. 90. కవిగా, కథకునిగా, వ్యాస రచయితగా ప్రసిద్ధులయిన ఆనందాచారి వచన రచనల్లోని వైవిధ్యాన్ని ప్రతిఫలించే వ్యాస పరంపర ఇది. వారంలో జరిగిన సంఘటనలతో సంబంధం లేకుండా ఏదైనా ప్రత్యేక అంశాన్ని ఆకట్టుకునేలా రాయడం ఈ కాలమ్ ప్రత్యేకత. ముఖ్యంగా అంశాన్ని ఎంచుకోడం, దానిని క్లుప్తంగా, చదివించేలా రాయడం ప్రధానం. ఇది ఒక సాధన, సృజనాత్మక విన్యాసం. ముఖ్యంగా ఒక వారం చదివినవారు మరో వారం ఆ కాలమ్ చదవాలని అనుకునేలా రాయాలి. అపుడే ఆ రచయిత కృషికి సాఫల్యం. ఈ పుస్తకంలో ఇలాంటి చిన్న చిన్న శీర్షికలు 60 వున్నాయి. ఏదయినా 'సోపతి'లో పేజీకి మించకుండా ఉండటం విశేషం. ఒక్కొక్క అంశం మీద నాలుగు అయిదు పేజీలయినా రాయవచ్చు. కానీ నిర్దేశించుకున్న కాలమ్ పరిధిలోనే ఏదయినా చెప్పాలి. ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా, ఎంత సమాచారం అందించినా, కోటబుల్ కోట్స్ వంటి మాటలు ఎన్ని ఇమిడ్చినా వరిమితి దాటకూడదు. ఈ విధంగా వారం వారం రాయడం రచయితకు 'పరీక్ష. ఈ పరీక్షలో విజయవంతమయ్యారు ఆనందాచారి.