Ma Nayana Balaiah
Editor · Novels

Price: Rs. 180. స్వాతంత్ర్యానికి ముందూ. ఆ తరువాతా ఈ దేశంలో ఒక దళితుని మనుగడ ఎట్లా వుందో చాలా శక్తివంతంగా పదునుగా చెప్పిన పుస్తకం ఇది. - ద హిందూ (మార్చ్ 3, 2012) ఈ కథ ఒక విజయ పరంపర, అయితే ఈ ప్రయాణం ఇంకా కొనసాగవలసి వున్నది. "మా నాయన బాలయ్య" బహుశా సొరంగంలో ప్రయాణం చేసిన తరువాత ప్రత్యక్షమయిన వెలుగు అనుకోవచ్చు. – డక్కన్ హెరాల్డ్ (ఫిబ్రవరి 19, 2012) అలెక్స్ హేలీ 'ఏడుతరాలు' రాసి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపాడు. ఆ పుస్తకం నల్లవాళ్ళ బైబిల్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు వై.బి. సత్యనారాయణ మూడు తరాల ఆత్మకథ రచించి చరిత్ర సృష్టించాడు. సాహిత్యంలో మరాఠీ ఆత్మకథ విజయకేతనం ఎగురవేస్తే ఇప్పుడు తెలుగులో తొలిజెండా ఎగురవేసిన ఈ పుస్తకం సాహిత్య చరిత్రలో ఓ మైలురాయి. మాదిగల చరిత్రను అక్షరీకరిస్తే అది రామాయణ, మహాభారతాలను మించిపోతుంది. ఇది ఒక బాలయ్య ఆత్మకథ మాత్రమే కాదు, లక్షలాది బాలయ్యల భార చరిత, రచయిత తన అపూర్వ మేధతో, పరిశీలనతో, రచనా శిల్పంతో ఈ పుస్తకాన్ని అమూల్యం చేశాడు. ఈ పుస్తకం చదివితే మాట తప్పని మానధనులైన మాదిగల మహోన్నత మనస్తత్వం, స్వేచ్ఛ, వారి అమాయకత్వం పరోపకార ప్రియత్వం, బహుభాషా పరిజ్ఞానం. సౌందర్యాత్మాక దృష్టి మరియు చెప్పుల నిర్మాణంలో గొప్ప కళాసృష్టి పాఠకుల దృష్టిని ప్రగాఢంగా ఆకర్షిస్తాయి. -ఎండ్లూరి సుధాకర్ దళిత జీవిత చరిత్రలలో ఓ మైలురాయి వంటిదీ పుస్తకం. ఈ జీవిత కథలో అప్పటి రైలు మార్గాల నిర్మాణం వలెనే బాలయ్య కూడా అంతే వేగంగా మూడు తరాలను ఆధునికతలోకి ప్రయాణం చేయించాడు. ఆధునికతని పోరాట సాధనంగా చేసుకున్నాడు. - గోపాల్ గురు తెలంగాణ గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం. సామాజిక వెలి, అంటరానితనం, శ్రమ దోపిడీ, కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించిన యుద్ధాన్ని కళ్ళకు కట్టే రచన ఇది. వాళ్ళీ క్రమంలో చేసిన ప్రయత్నాలనూ, అనుభవించిన వేదననూ నిజాయితీగా ఆవిష్కరిస్తుందిది. విద్యకోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛకోసం జరిపే పోరాటంలో విజయం ఎంత ప్రధానమో బలంగా నొక్కి చెప్పే ఈ రచన -మనల్ని కల్లోల పరుస్తుంది. అదే