Ma gamyam... Sampurna Prajaswamyam Ma Prathinidhulu Makkavali!
Editor · Economics & Agriculture

Price: Rs. 65. ప్రజాస్వామ్య చీకటి కోణం వెలుగు చూడాలి. పీడిత జన ప్రాతినిధ్య గళం మోగాలి. సంపూర్ణ ప్రజాస్వామ్యం రెక్క విప్పాలి. స్వాతంత్య్రం ఆధునిక పౌరజీవన వ్యవస్థ. ప్రజాస్వామ్యం ఒక పరిపాలనా వ్యవస్థ. ఈ రెండూ విడదీయవీలుకాని బంధంగల రాజనీతి సూత్రాలు. స్వాతంత్ర్యానికి, సంపూర్ణ స్వాతంత్ర్యానికీ మధ్య గల సంబంధమూ, తేడాలు ప్రజాస్వామ్యానికీ సంపూర్ణ ప్రజాస్వామ్యానికీ మధ్య కూడా ఉన్నాయి. స్వాతంత్య్రం సంపూర్ణ స్వాతంత్ర్యానికి దోహదపడినట్టుగా, ప్రజాస్వామ్యమూ సంపూర్ణ ప్రజాస్వామ్యానకి దోహదపడాలి. ఎందుకంటే మన దేశంలో పాలకవర్గాలు-పాలితవర్గాలు అనే వ్యత్యాసం ఇంకా మునుపటిలాగే కొనసాగుతోంది. ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి, 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాలితవర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించి, దేశపాలనలో భాగస్వాములను చెయ్యాలి. ఈ ఒక్క ముందడుగుతో ప్రజాస్వామ్యం సంపూర్ణ రాజకీయ ప్రజాస్వామ్యంగా అవతరిస్తుంది. అదే 10-15 ఏళ్ళలో దేశంలో సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతుంది. అప్పుడే దేశంలో పరిఢవిల్లుతుంది. సంపూర్ణ ప్రజాస్వామ్యం కాదంటే ' మా ప్రతినిధులు లేని చట్ట సభలు చేసే చట్టాలను మేమెందుకు గౌరవించాలి' అని పాలితవర్గాలడిగితే, మన దగ్గర సమాధానం ఉండదు!