Ma ammamma subbalaxmi (మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి)
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 90. ఇప్పటికి సరిగ్గా 120 ఏళ్ళ క్రితం పుట్టిన ఒక తమిళ బ్రాహ్మణ మహిళజీవిత కథ ఇది. ఆ కాలానికి, ఆ సామాజిక స్థాయికి చెందిన సగటు మహిళలందరూ గడిపిన జీవితమే కదా! ఇందులో మనం తెలుసుకోవాల్సిందేముంది అనిపించొచ్చు.అవును ఆమె ఒక సామాన్య మహిళే. కాకపోతే కాస్త భిన్నం. బడి ముఖమే ఎరగనిసుబ్బలక్ష్మి గ్రంథాలయాల నుంచి తెప్పించుకుని, కుదిరితే కొనుక్కుని వందల పుస్తకాలుచదివింది. వాటి నుంచి నోట్సు రాసుకుంది. తమిళం, ఆంగ్ల భాషల్లోని కాల్పనికసాహిత్యంతో పాటు ఖగోళశాస్త్రం, మానసిక శాస్త్రం, చరిత్ర, యాత్రా సాహిత్యంవంటి వైవిధ్యం వున్న రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదివింది. ప్రకృతంటేప్రాణం ఆమెకు. చిత్రకళపై మక్కువ. దైవంపై విశ్వాసం ఉంది. కాని పూజలు, పునస్కారాలు చేయలేదు. మూఢ విశ్వాసాలూ లేవు. కూతురిని భర్త బడికి పంపనంటే మద్రాసుకు తీసుకొచ్చి అన్న ఇంట్లో ఉండి చదివించుకుంది. ఇలాంటిఓ సాధారణ అసాధారణ మహిళ కథ ఇది. మైథిలి శివరామన్, ఐద్వా (ఆలిండియా డెమొక్రటిక్ విమన్స్అసోసియేషన్) వ్యవస్థాపక సభ్యురాలు. ఆ సంఘం జాతీయఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. కార్మికోద్యమం (సిఐటియు) లోను ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడు, కిల్వెన్ మణిలో మైథిలీ శివరామన్ దళిత వ్యవసాయ కూలీలపై అక్కడి పెత్తందారీ భూస్వాముల దారుణ మారణకాండ ఆమెను వామపక్ష ఉద్యమకారిణిగా మార్చింది. మహిళా ఉద్యమాన్ని తీర్చిదిద్దిన వ్యక్తిగా ఆమె తన అమ్మమ్మ లాంటి సాధారణ మహిళలజీవితాన్ని చరిత్రలో భాగం చేయదలిచారు. దాని ఫలితమే ఈ పుస్తకం.