Luyee bonaparty (18)లూయీ బోనపార్టీ (18)
Editor · Politics

Price: Rs. 90. "నిజానికి ఇదొక ప్రతిభావంతమైన రచన. యావత్తు రాజకీయ ప్రపంచాన్ని పిడుగు పాటు మాదిరిగా "దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన సంభవించిన వెంటనే దాన్ని కొందరు నైతిక ఆగ్రహంతో బిగ్గరగా అరచి ఖండించారు.మరికొందరు దాన్ని విప్లవం నుండి విముక్తిగాను, దాని పొరపాట్లకు శిక్షగాను పరిగణించారు. అయితే దాన్ని చూసి ఆశ్ఛర్యపడ్డారే కానీ అర్థం చేసుకున్న వారెవరూ లేరు. అటువంటి ఈ ఘటన జరిగిన వెంటనే మార్క్స్ దాన్ని సంగ్రహంగా, సునిశిత వ్యంగ్య వైభవంతో వివరించారు. ఆ వివరణ ఫిబ్రవరి రోజుల దరిమిలా యావత్తు ఫ్రెంచి చరిత్ర క్రమాన్ని దాని అంతస్సంబంధాలతో పాటు తేటతెల్లం చేసి డిసెంబర్ 2 నటి అద్భుతనాన్ని ఈ అంతస్సంబంధం యొక్క సహజ, ఆవశ్యక పర్యవసానంగా తేల్చిచెప్పింది. అలా చేసేటపుడు రాజకీయ కుట్ర హీరోను, అత్యంత సముచితమైన అసహ్యభావనతో తప్ప మరోవిధంగా చూడాల్సిన అవసరం సైతం ఆయనకు లేకపోయింది అయన చేసిన చిత్రణ ఎంత ప్రతిభావంతంగా ఉందంటే, అటుతరువాత బయటపడిన ప్రతి ఒక్క అంశం వాస్తవాన్ని మార్క్స్ ఎంత యథాతధంగా చిత్రించాడో అన్నదానికి కొత్త రుజువును సమకూర్చింది. సమకాలీన సజీవ చరిత్ర గురించిన వివిష్టమైన ఈ అవగాహన పాటు, ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలోనే ఇంత స్పష్నంగా అంచనా వేయడమన్నది నిజంగా సాటిలేని "విషయం .