Eluri Lakshmi Narayana
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 190. జీవించింది ఆరు దశాబ్దాల లోపే అయినా, ఆ కామ్రేడ్ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) విస్తరించి వేళ్ళూనుకొనడంలో, యువ నాయకత్వాన్ని ఆకర్షించి, శిక్షణనిచ్చి, పోరాట ధృక్పదాన్ని ఇవ్వడంలో, జిల్లా వ్యాపితంగా వ్యవసాయ కార్మికులను సంఘటితం చేసి, సమరశీల కూలి పోరాటాలను అభివృద్ధి చేయడంలో నిర్వహించిన పాత్ర సాటిలేనిది. -బివి రాఘవులు Though born into a wealthy peasant family, Com. Laxminarayana dedicated his entire life to the oppressed sections Dalits, Adivasis, and the rural poor. Even though his life ended before he reached the age of 60, it was deeply intertwined with struggles for wages, land, and social justice. In the course of these struggles, he faced attacks from landlordsu henchmen, at-tempts on his life, false cases, state repression, and imprisonment. Through all these hardships, he emerged as a true warrior of the peopleus movement. - Vijaya Raghavan ఏలూరి గారితో నేను చాలా కాలం కలిసి పనిజేశాను. తనకంటే జూనియర్ని అనే భావం ఆయనలో ఏ కోశానా ఉండేది కాదు. నేను జిల్లా కార్యదర్శిగా పని చేసినపుడు ఆయన చూపిన ఆదరణ, అభిమానం నేను మర్చిపోలేను. ఏలూరి గారి లాగే వారి భార్య జయమ్మగారు, కూతుర్లు అరుణ, వారి కుటుంబ సభ్యులు, చనిపోయిన కుమారుడు కామ్రేడ్ రఘు ఉద్యమంలో పనిజేస్తూ 'ఆదర్శ కమ్యూనిస్టు కుటుంబం'గా ఉన్నారు. - తమ్మినేని వీరభద్రం