Love Jihad
రవి నర్ల · Caste, Religion & Culture

Price: Rs. 170. లవ్ జిహాద్”, “ముస్లింల బుజ్జగింపు", "బలవంతపు మత మార్పులు, ఇవన్నీ ఇప్పుడు భారత్లో రోజువారీ చర్చలుగా మారిపోయిన కుట్ర సిద్ధాంతాలు. రాజకీయ నాయకులు, గొంతు చించుకొని గోల చేసే మీడియా, నిరంతరం కొనసాగుతున్న సోషల్ మీడియా ఫార్వార్డులు, అప్ డేట్స్ వీటిని ఇంకా పెంచి ప్రచారం చేయడంతో, చాలా మంది ఈ కథనాలనే నిజం అనుకుని నమ్ముతున్నారు. కానీ ఈ మాటల్లో నిజం ఉందా? నిజంగా భారతదేశంలోని మైనారిటీలు, హిందూ ధర్మాన్ని బలహీనపరచడానికి ఏదైనా కుట్ర చేస్తున్నారా? లేక ఇవన్నీ అధికారంలో ఉన్నవారి ప్రయోజనాలను నెరవేర్చేందుకు సృష్టించి, వ్యాప్తి చేసిన కథలేనా? స్పష్టమైన దృష్టితో, బలమైన ఆధారాలతో, లోతైన పరిశోధనతో రాసిన 'లవ్ జిహాద్ - ఇతర అభూత కల్పనలు' పుస్తకం - ఈరోజు భారతదేశాన్ని నిలువుగా చీలుస్తున్న వైరల్ అబద్ధాలకు ఒక బలమైన ప్రత్యామ్నాయం. ఒక అవసరమైన విరుగుడు.