LENIN YAADILO

Editor · Best Selling

LENIN YAADILO book cover

Price: Rs. 165. 2020 ప్రపంచ తొలి సోషలిస్టు రాజ్య స్థాపకుడు, మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 150వ జయంతి ఉత్సవ ఏడాది. మూడు దశాబ్దాలుగా అమలు జరిపిన ప్రపంచీకరణ, ఉదారవాద విధానాలు వైఫల్యం చెందాయన్న చర్చ కరోనా మహమ్మారి ప్రభావంతో మరోసారి ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ విధాన విశ్లేషణకు, దాని ఆధారంగా సాగే విప్లవ కార్యాచరణకు దోహదపడే వ్యాసాలతో నవతెలంగాణ ప్రచురణాలయం 'లెనిన్ యాదిలో' (సంకలనం) గ్రంథాన్ని వెలువరించింది. 'నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయటమే మార్క్సిజం యొక్క కీలకాంశం' అన్నాడు లెనిన్. ఈ సూత్రాన్ని ప్రతి సందర్భంలోనూ ఆచరణలో పెట్టి, ప్రతి అంశాన్ని నిర్దిష్టంగా విశ్లేషించి విప్లవ లక్ష్యాలను, కార్యాచరణను రూపొందించి అనేక గొప్ప ఫలితాలను సాధించాడు. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలోని మెన్షివిక్కు గ్రూపులు వివిధ సందర్భాల్లో ముందుకు తెచ్చిన రివిజనిస్టు ధోరణులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించిన లెనిన్ కృషి సదా అనుసరణీయం.

Browse more Telugu books