Leadership

Dr. B.V. Pattabhiram · Personality Development

Leadership book cover

Price: Rs. 240. దేనికీ భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులు సాధిస్తారు. భయపడిన మరుక్షణం మీరు నాశనమైనట్టే. ఈ ప్రపంచంలోని బాధలన్నింటికీ మహాకారణం భయమే, మూఢ నమ్మకాలన్నింటిలోకి పెద్దది భయమే. మన దుఃఖాలన్నింటికీ కారణం భయం. నిర్భయత్వం మనకి ఒక్క క్షణంలో ముక్తిని తెచ్చిపెట్టగలదు. కాబట్టి, "లేవండి? మేల్కొనండి! గమ్యాన్ని సాధించేవరకూ ఆగకండి!" - విజయం సాధించటానికి అర్హతలేని వ్యక్తినెవరినీ భగవంతుడు ఇప్పటివరకు సృష్టించలేదు. మనుషులందరినీ ఒకేలా సృష్టించాడు. మనుషులు వారి వారి జీవితాల పట్ల ఏర్పరచుకొన్న దృక్పథమే మనిషి భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. మనచుట్టూ ఉన్న వనరులలోనుంచి మన అవకాశాలను సృష్టించుకోవాలి. అలా సృష్టించుకొన్న ప్రతివారు విజేతలై మన కళ్లముందు మనకు మార్గదర్శకత్వం వహిస్తూ కనిపిస్తూనే ఉన్నారు. 'నేను విజయాలు సాధించలేను', 'నాకు అవకాశాలు లేవు లాంటి భావనలవల్ల మాత్రమే కొంతమంది విజయాలు సాధించలేకపోతున్నారు. 'ఒకరు సాధించిన విజయాన్ని ఎవరైనా సాధించగలరు' అనేది అక్షరసత్యం. దానికి మనముందే అనేక ప్రతీకలున్నాయి. 'నేను ఇప్పటివరకు ఒక్క విజయంకూడా సాధించలేదు' అని క్రుంగిపోయే వ్యక్తి జీవితాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే అతని జీవితంలో పరాజయాలకన్నా విజయాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. మనం చేయవలసిందల్లా మనం సాధించిన విజయాలను విశ్లేషించుకొని కొనసాగించడమే. అలా కొనసాగించటానికి మనం సన్నద్ధమైతే మనతో కలిసి ప్రయాణం చేయటానికి ఓ పెద్ద సమూహం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎందరో విజేతలు మనకు మార్గదర్శకత్వం వహిస్తుంటారు. మన ప్రయత్నానికి వేయి వేల చేతులతో సహకారం అందిస్తారు. మనకు కావలసిందల్లా సంకల్పం మాత్రమే. సంకల్పబలంతో విజయ పరంపర కొనసాగించటానికి మీ పరివారాన్ని సన్నద్ధం చేయండి. మీ సంకల్పానికి చేయూతగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

Browse more Telugu books