Latkorsaab

Editor · Literature

Latkorsaab book cover

Price: Rs. 108. గతంలో ఒకనాడు అబూఅబ్రహం వంటి కార్టూనిస్టులు ఒక ప్రశ్నతో చికాకు పడ్డారు. తమ కార్టూన్లలో హ్యూమరసం చురుక్కుమనిపించగల సున్నిత స్థాయిలో రాజకీయాలు లేవు కనుక అసలు కార్టూనింగ్ మానుకోవాలా? అనుకునే దాకా జరిగింది కథ... అంటే రాజనాల విలన్ హాసం చేస్తుండగా శ్రీమతి కృష్ణ కుమారి కోపంగా అతనిపై పువ్వు విసిరినట్టన్నమాట! ఏదీ అధికార రాకాసి మూకకు చీమ చిటుక్కుమనదు. గనుక వ్యంగ్యం మానుకోవాలా? అని రచయితలు అనుకోరాదు. ఎంత సెటైరికి అంత పదును... మాఫలేషు కదాచన వ్యవహారం! కాబట్టి మర్యాద మీరిన కోపం, ఘాటైన వ్యంగ్యం పూసిన పదాలుగా అస్త్ర సంధానం చెయ్యడం ముమ్మాటికీ ముఖ్యమని ఈ నవల మర్యాదగా చెప్తుంది. నవల బహుబాగుంది. చదవడం పూర్తవగానే సమాజ రోగం కుదురుతుందని భయపడకండి. అసలిలాంటి నవల రాయడం మహా సాహసం! భానుమూర్తీ... భలే పని చేసావు పో! - శివాజీ తల్లావజ్ఝల

Browse more Telugu books