Lal, Neel, Maithri-Neti Charithraka Avasaram

Editor · History

Lal, Neel, Maithri-Neti Charithraka Avasaram book cover

Price: Rs. 90. మనం లాల్- నీల్ శక్తుల మద్య మైత్రి అని మాట్లాడినా ఐక్యత అని చెప్పినా ఆ రెండు శక్తుల మధ్య బలమైన మైత్రి చాలా తప్పనిసరి అవసరం అని చెబుతున్నాము. లాల్- నీల్ శక్తుల మైత్రి లేక ఐక్యత అనేది ఒకే అర్ధంలో మనం వాడుతున్నాము తప్ప రెండు సిద్ధాంతాలతో ఏక పార్టీ ఏర్పాటు అనే అవగాహనతో మనం వాడటం లేదు. -లాల్- నీల్ మైత్రి కోసం అవగాహనా పత్రం నుండి రెండు సిద్ధాంతాలను చర్చించి ఏదో ఒకటి గొప్పదనో, లేక రెండింటినీ కలిపి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఈ పుస్తక ఉద్దేశ్యం కాదు. -డి.హనుమంతరావు లాల్-నీల్ ఉద్యమాలు బలపడటం వల్ల ఆ రెండు శక్తులు బలహీన పడవు, పైగా అవి ఒక దానిని మరొకటి ప్రభావితం చేసుకుంటూ, సహకరించుకుంటూ మరింత శక్తివంతంగా మారుతాయి. లాల్-నీల్ శక్తుల మధ్య ఐక్యత ఎంత బలహీన పడితే, ఆధిపత్య కుల, మత, దోపిడి శక్తుల బలం అంత పెరుగుతుంది. -తెలుగు వెంకటేశ్వర్లు పచ్చి మనువాద, మతవాద, దోపిడీ పాలక శక్తులతోనైనా చెట్టాపట్టాలేసుకుని ఐక్య కార్యాచరణలో సాగిపోవడానికి ఇష్టపడే కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, మిత్ర శక్తులైన తమలో తాము కలవడానికి అంతగా ఇష్టం చూపలేకపోవడం పరమ విడ్డూరం గాక మరేమిటి? -అబ్దుల్ నూర్ బాషా

Browse more Telugu books