KUTRA

Editor · Politics

KUTRA book cover

Price: Rs. 55. "భారతదేశం, చైనా ఒక్కటవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇదే సమయంలో బ్రిటన్ భారత దేశానికి కీలకమైన అణుసహాయం అందించడానికి అంగీకరిస్తుంది. కాని ఈ రెండు పరిణామాలు ప్రపంచాధిపత్యం కోసం వెంపర్లాడుతున్న అమెరికాకు సుతురామూ గిట్టేవి కావు. అందుకే ముందుగా బ్రిటన్ అందించబోయే అణు సహాయాన్ని ఉపసంహరించుకునేలా వత్తిడి చేయడానికి పూనుకుంటుంది. దీనికోసం తనదైన శైలిలో రంగంలోకి దిగుతుంది. అంతటితో అగకుండా భారతదేశంలో ప్రభుత్వాన్నే కూల్చివేయడానికి కుట్ర పన్నుతుంది." ఇదంతా వాస్తవమే అన్నట్లు కదూ. కాని ఇది వాస్తవాన్ని పోలిన కథ. ఇప్పుడు మీరు చదవబోయే రాజకీయ నవలలోని ప్రధాన ఇతివృత్తం. దీన్ని రాసింది ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షునిగా పనిచేసిన విలియం క్లార్క్

Browse more Telugu books