Kurumala sahithyam charithra samskruti
Editor · History

Price: Rs. 260. సమసమాజ నిర్మాణంలో కురుమల అమర వీరుల త్యాగాల గాథలు, పాటల రూపంలో ప్రజలు వారిని స్మరించుకోవడం ద్వారా వారిని చిరంజీవులుగా నిలిపిన విధానాన్ని భావుకతతో వివరిస్తాడు. కురుమలపై వచ్చిన సాహిత్యాన్ని ప్రత్యేకంగా విశ్లేషించాడు రచయిత. అంతేకాదు కురుమలకు చెందిన వృత్తిమాండలిక పదాలను సవివరంగా వివరిస్తూ వారి కుటుంబాల ఇతివృత్తాలను తనదైన శైలిలో నమోదు చేశాడు మహేందర్. మొత్తంగా కురుమల సాహిత్యానికి కేరాఫ్ అడ్రస్, ఒక ఎన్సైక్లోపీడియా వలే ఈ గ్రంథం నిలుస్తుందని చెప్పగలను. - ఆచార్య సూర్యాధనంజయ్ ఈ పుస్తకాన్ని ఒక సిద్ధాంత పరిశోధనా గ్రంథంగానో, ఒక కులానికి సంబంధించిన చరిత్రగానో చూడవలసిన అవసరం లేదు. చరిత్రలో మరుగున పడిపోయిన కొన్ని అంశాలలో ఒకటి అయిన ఈ కురుమల సాంస్కృతిక మూలాలను తెలుసుకోవడం, ముఖ్యంగా సమకాలీన అస్తిత్వ సమాజంలో అవసరమైనది. కురుమల అస్తిత్వ ప్రతీకగా ఈ పుస్తకాన్ని చూడవలసిన అవసరం ఉంది. - ఆచార్య ఎన్. రజని ... ఈ గ్రంథం కురుమల జీవన విధానాన్ని, వారి సాంస్కృతిక, సాహిత్య సంపదను ఈ ప్రపంచానికి అందించడంలో సఫలీకృతమైందని చెప్పక తప్పదు. ఇలా విశిష్టమైన ఈ కులం గురించి, వీరి భాష గురించి మరిన్ని గ్రంథాలు రాగలవనీ, అలా రావడానికి మహేందర్ దీని ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడని చెప్పక తప్పదు. ఇటువంటి పరిశోధనా గ్రంథాన్ని తెచ్చినందుకు మహేందర్ ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డా॥ వి.ఆర్. రాసాని