Kula Rahitha Bharatham

Editor · Caste, Religion & Culture

Kula Rahitha Bharatham book cover

Price: Rs. 135. ఇందులోని మొదటి ఆరు వ్యాసాలలో అణగారిన జాతుల నాయకత్వం ఎందుకు, కులాలను సృష్టించిన భారతజాతి ఎలా, ఎందుకు కుల పీడితులకు క్షమాపణలు చెప్పాలి, సీల నిర్మూలనకు ఇదువరకు ఏ పద్ధతులు పాటించారు. మరి ఇప్పుడెలా కులాన్ని నిర్మూలించవచ్చో నాకు తోచిన నా అనుభవ పరిధిలోకి వచ్చిన ఆలోచనా ధారతో చర్చించడం జరిగింది. ఇందులో ఓ శాస్త్రీయ పరిణామముంది. ఆ తర్వాతి ఆర్యాయాలలో కుల నిర్మూలనకు మూలజాతుల రాజ్యాధికార అవసరమేంటో, అది సాధించడం ఎలాగో, అందుకు చేయాల్సిన కుల సమీకరణలు, రాజకీయ సమీకరణలేంటో చర్చించాను. మైనారిటీలకున్న దళిత జాతి మూలాలు, ఎవరైనా సరే మతపరంగా ఆలోచిస్తే, ఏదేశం లోనయినా మతం ప్రాధాన్యత వహిస్తే జరిగే అనర్థాలేంటో కూలంకషంగా చర్చించడమైంది. మతపరంగా, కులపరంగా దేశాలు కుంచించుకపోతే భారతదేశం ఎంత నష్టపోయిందో, సుఖవాంఛ ప్రకృతిని ఎలా విధ్వంసం చేస్తుందో అది ఎవరివల్ల జరుగుతుందో, ప్రకృతిని కాపాడటానికి ప్రకృతి బిడ్డలైన మూలజాతుల రాజ్యాధికారం ఎలా తోడ్పడుతుందో కూడా చర్చించడమైంది. ఇలా ఈ దేశంలో కులం వల్ల జరుగుతున్న అనర్థాలు కులరహిత భారతాన్ని స్థాపించాల్సిన అవసరం, అందుకు మూలజాతుల రాజ్యాధికార ఆవశ్యకతను గురించి తెలిపే వ్యాసాలిందులో ఉన్నాయి. దేశాన్ని తరతరాలుగా పీడిస్తూ ఈదేశ మూలజాతులను పాలితులుగా సేవకులుగా మార్చిన కులాన్ని నిర్మూలించి 'కులరహిత భారతం' స్థాపించడానికి, మానవీయ సమాజస్థాపన కొరకు ఈ పుస్తకం ఏ మాత్రం తోడ్పడినా ఈ రచన ఉద్ధేశ్యం నెరవేరినట్టే.

Browse more Telugu books