Kula Nirmula series 8

Editor · History

Kula Nirmula series 8 book cover

Price: Rs. 135. వేలాది ఏళ్లుగా కోట్లాది వ్యదార్థ జీవుల నెత్తుటి చెమటను హక్కు భుక్తంగా చేసుకున్న కుల-వర్ణ వ్యవస్థ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మోగించిన యుద్ధభేరీ ఈ 'కుల నిర్మూలన' పుస్తకం. 1936లో ఈ పుస్తకం వెలువడిన నాటి నుంచి వర్ణవ్యవస్థ నిర్మూలించడానికి యుద్ధ సూత్రాలను కావాల్సిన వాళ్లకు అందిస్తూనే ఉంది. కమ్యూనిస్టు ప్రణాళిక ఎలాగైతే కమ్యూనిస్టులకు స్ఫూర్తి వంతంగా ఉందో, అంతకంటే రెట్టింపుగా కుల-వర్ణ వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడే అన్ని రకాల శక్తులకు ఈ పుస్తకం స్ఫూర్తి దాయకంగా ఉంది. అనువాదంలో వర్ణనిర్మూలన అన్నా కుల నిర్మూలన అన్నా ఒకే అర్థంలో అణగారిన కులాలు వాడుతున్నారు. మొత్తానికి కుల-వర్ణ నిర్మూలన అనేది వర్ణవాదులపై డాక్టర్ అంబేడ్కర్ గురిపెట్టిన స్టెనన్. “1930లలో 'కుల-వర్ణనిర్మూలన' అనే ఈ సైద్ధాంతిక గ్రంథం సంభావిత స్పష్టతతోను, ఎంతో రాజకీయ అవగాహనతో కూడుకున్న అద్భుతమైన రచన అనేది ప్రపంచం తెలుసుకోవాల్సిన విషయం", అంటారు కులవ్యవస్థ గురించి, జెండర్ సమస్య గురించి విస్తృతంగా పరిశోధించిన ఉమాచక్రవర్తి.

Browse more Telugu books