Krishnaveni

Ranganayakamma · Novels

Krishnaveni book cover

Price: Rs. 85. ఏ రచయిత అయినా, తను రాసిన వాటిని, 20-30 ఏళ్ళ తర్వాత ఒక సారి చదివి. చూసుకుంటే, ఆ రచనల్లో అతనికి ఏవైనా తప్పులు కనపడితే, ఆ రచయిత భావాలు, గతం కన్నా మారినట్టు అర్థం. లేదా, ఆ రచనల్లో ఏ తప్పులూ కనపడకపోతే, మొదట రాసినప్పుడే అవి తప్పులు లేనివి కావచ్చు; లేదా, తప్పులు వున్నా వాటిని ఆ రచయిత గ్రహించలేదంటే, ఆ రచయిత భావాలు, ఆ రచన చేసిన కాలానికీ, తర్వాత కాలానికీ, ఏమీ మారక పోవడం కావచ్చు. పురుషుడికి చతుర్వర్ణాల నించీ ( నాలుగు కులాల నించీ) భార్యలూ, ఆ పైన వేశ్యలూ ఉండవచ్చని చెప్పిన విశ్వనాధ సత్యన్నారాయణ గారు. ఇంకో వంద సంవత్సరాలు జీవించి వుంటే, తను చెప్పిన విషయాలు తప్పని చెప్పుకునే వారా? చలం గారి 'మైదానం' చూడండి! 'ప్రేమ' మీద చెప్పాలనే ప్రయత్నం అది. ప్రేమతో ఏర్పడని వైవాహిక సంబంధాల్ని నిరసించే ఈ కథ, ప్రేమకి అర్ధాన్ని మార్చే, ప్రేమ సౌందర్యాన్ని వికృతం చేసే మార్గంలోకి తీసుకు పోయి విడిచి పెడుతుంది. ఈ రచయిత వృద్ధాప్యం దాకా జీవించారు. అయినా, తన కధా వస్తువుల్లో ఏమైనా పొరపాట్లు జరిగాయేమోనని ఆయన పునర్విమర్శలు చేసుకోలేదు. కొందరు రచయితలకు, తమ రచనల్లో పొరపాట్లు కొన్ని తెలిసినా, రచనలన్ని టినీ మళ్ళీ పరిశీలించడం సాధ్యం కూడా కాదు. రచయితలకు సాధ్యం కాని పని పాఠకులే చేసుకోవాలి. సమస్యల మీద కథలు రాయాలంటే, సమస్యకి కారణాలు తెలియని మిడి మిడి జ్ఞానం పనికి రాదు. కనీసం సమస్యని సమస్యగా చూపించగలిగే జ్ఞానం అయినా వుండాలి. సమస్యని వాస్తవికంగా చూపించగలిగితే, పరిష్కారం దాని లోనే కనపడుతుంది. రచయితలు అనే వాళ్ళు మామూలు మనుషుల కన్నా గొప్ప మేధావులేమీ కారు. రచయితలు కూడా సమాజం ఇచ్చే భావాల తోనే నిండిపోయి వుంటారు. ఒక 'కళ' తెలిసినంత మాత్రాన వాళ్ళు అభ్యుదయ వాదులు కాలేరు. 'అభ్యుదయ భావాలు' అనే వాటిని ప్రత్యేకంగా నేర్చుకోవాలి. కానీ, ఇలా చెప్పడం కూడా మళ్ళీ పొరపాటే. రచయితల్లో కూడా వర్గ భేదాలు వుంటాయి. ఎవరి వర్గ భావాలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అభ్యుదయం కోసం రాసే రచయితలైనా, తమ రచనల్ని కొంత కాలం తర్వాత ఒక సారి చూసుకుంటే, గతం కన్నా మారాలో, మారక్కర లేద

Browse more Telugu books