KOVUR Jeevitham

Editor · Biographies & Auto Biographies

KOVUR Jeevitham book cover

Price: Rs. 30. గోరాగా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు, సరస్వతీ గోరా గార్ల రెండవ సంతానం లవణం 1930 అక్టోబరు 10వ తేదీన జన్మించారు. తండ్రి అడుగుజాడలలో నడిచారు. విజయవాడలో నాస్తిక కేంద్రంలో తన 12వ ఏటి నుండే ప్రజాజీవన ప్రస్థానం ప్రారంభించారు. 1977లో దివిసీమ ఉప్పెనతో జనజీవనం అతలాకుతలం అయినప్పుడు సహాయ, పునవాస కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. భార్య హేమలతతో కలిసి 'సంస్కార' ద్వారా జోగినీ వ్యవస్థ రద్దుకు, స్టువర్టుపురం దొంగల సంస్కరణకు కృషి చేశారు. జీవితకాలం నాస్తికోద్యమం వ్యాప్తికి, మానవత్వపు ఔన్నత్యం చాటడానికి పాటుపడ్డారు. నిగర్వి, నిరాడంబరుడు. డీనోటిఫైడ్ గిరిజనులకు పునరావాసం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించినందుకు 2009లో జమునాలాల్ బజాజ్ అవార్డును అందుకున్నారు. వైష్ణవ సెంటర్ ఫర్ ఎన్లైట్మెంట్కు అనుబంధమైన అంతర్జాతీయ సేవా సంఘం 2011లో లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును ఇచ్చి సత్కరించింది. మానవహక్కులు, సంఘ సంస్కరణల విషయాలలో కృషి చేసినందుకు ప్రాబ్ రిసోర్స్ సెంటర్ 2015లో అంతర్జాతీయ మానవత్వ అవార్డును ఇచ్చి గౌరవించింది.

Browse more Telugu books