Koulu, Vaddi, Laabham, Jeetham ! Samajapu Uthapatthi Kramamlo Rahasyalu!
Ranganayakamma / రంగనాయకమ్మ · Politics

Price: Rs. 55. “పెట్టుబడీ - లాభమూ (సంస్త లాభమూ, వడ్డీతో కలిపి), భూమీ - కౌలూ, శ్రమా - వేతనాలూ; ఈ త్రిముఖ (ట్రినిటీ) సూత్రం (ఫార్ములా) లోనే సామాజిక ఉత్పత్తి ప్రక్రియ తాలూకు సర్వ రహస్యాలూ ఇమిడి వున్నాయి.” (కాపిటల్-3 లో, మార్క్స్) "భూస్వామి, భూసంబంధ ఆస్తి ద్వారా మొత్తం కౌలుకు హక్కుదారుగా ఉంటాడు... కౌళ్ళకైతే భూస్వామి ఏమీ చెయ్యడు.” (అదనపు విలువ సిద్ధాంతాలు-2 లో, మార్క్సు) “డబ్బు యజమానికి, అదనపు విలువలో నించీ ఒక వాటా వెళ్తుంది. దాని పేరే 'వడ్డీ'! వడ్డీ అనేది మొదటినించీ కూడా, పూర్తిగా ఒక హేతువిరుద్ధ (ఇర్రేషనల్) వ్యక్తీకరణే!" (కాపిటల్-3 లో, మార్క్సు, “డబ్బు పెట్టుబడికి కేంద్రంగా బ్యాంకు వుంటుంది... అది తను అప్పిచ్చే మొత్తం నించి ఎక్కువ వడ్డీ వసూలు చేసి, తను అప్పు తీసుకునే మొత్తం మీద తక్కువ వడ్డీ చెల్లించి, ఆ రకంగా లాభం పొందుతుంది.” (కాపిటల్-3 లో, మార్క్సు) “సామాజీకృత ఉత్పత్తిలో (కమ్యూనిస్టు సమాజంలో) డబ్బు పెట్టుబడి పూర్తిగా రద్దవుతుంది.' (కాపిటల్-2 లో, మార్క్సు) *