Konte Bomma Sahasalu

కొల్లూరి సోమశంకర్ / Kolluri Somasankar · Novels

Konte Bomma Sahasalu book cover

Price: Rs. 108. పినోకియో ఒట్టి అల్లరి పిల్లడు. చదువు అంటే అతనికి గిట్టదు. కొత్త విషయం నేర్చుకోవడం అంటే విసుగు. పనిచేయడమంటే పడనే పడదు. తిని తిరగాలన్నదే యావ. ఆటలు పాటలు తప్ప అతనికి ఒక ఏమీ అక్కర్లేదు. అమ్మ నాన్న మాట వినడు. ఆకలయినప్పుడే వాళ్ళు గుర్తొస్తారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళను తలచుకొంటారు. జీవితం అంటే కేవలం వినోదం అనుకొంటాడు. అతనిది కొయ్య బుర్ర, ఏదీ సరిగా ఆలోచించడు. మంచి సలహా చెప్పేవాళ్ళంటే మంట. పాడైపోయే మాట చెప్పేవాళ్ళంట ఇష్టం. అయితే చివరికి ఇదంతా మారిపోతుంది. పినోకియో చాలా మంచి పిల్లవాడయి పోతాడు. బాధ్యత నేర్చుకొంటాడు. అందులో ఉన్న సంతోషాన్ని గ్రహిస్తాడు. సరదా సరదాగా మీ పిల్లలకి మంచి నడవడికను నేర్పే కథ, కొంటె బొమ్మ సాహసాలు.

Browse more Telugu books