Kongu Chatu Krishnudu

యండమూరి వీరేంద్రనాథ్ • యర్రంశెట్టి శాయి / Yandamuri Veerendranath • Yerramsetty Sai · Novels

Kongu Chatu Krishnudu book cover

Price: Rs. 108. కొంగు చాటు కృష్ణుడు “ఏమిటండీ మీరు అలిసిపోయేది? చిటికెడు మట్టి తీసుకొని భూమి మీదకు 'ఉఫ్... ఉఫ్' మని ఊదటమేగా” అంది సరస్వతి. "జీవసృష్టి అంటే వీణ మీద 'టింగ్ టింగ్' మని వేళ్ళు కదపడం కాదు. ఒక ప్రాణిని సృష్టించు. తెలుస్తుంది.” వళ్ళు మండిన వరదాయని కాసింత మట్టి తీసుకొని గబగబా మూడు బొమ్మలకి ప్రాణం పోసి భూమ్మీదకి వదిలేసింది. ఫకాలున నవ్వాడు బ్రహ్మ. “ఎందుకు నవ్వుతున్నారు?" ఉక్రోషంగా అడిగింది. "తుమ్మెదల్ని సృష్టించి పువ్వుల్ని మర్చిపోతే వారికి పెళ్లిళ్ళు ఎలా చేస్తావ్ పద్మాసనీ?” అంటూ దెప్పి పొడిచాడు. అదెంత పని అన్నట్టు మరో రెండు ఆడబొమ్మల్ని తయారు చేసి వదిలింది. భూనభోంతరాళాలు దద్దరిల్లేలా కేక పెట్టి, “ఇప్పుడు నువ్వు తయారు చేసిన వారు... హతవిధీ. ఒకేలా ముగ్గురు మగాళ్ళు. ఒకే పోలికతో ఇద్దరు ఆడవారు. ఇక ఆ అయిదుగుర్నీ దేవుడే రక్షించాలి.” ఆన్నాడు బ్రహ్మ.

Browse more Telugu books