Konda Kinda Palle
వాడ్రేవు చినవీరభద్రుడు / Vadrevu Chinaveerabhadrudu · Novels

Price: Rs. 85. "మీ కవితకు కునుకు వదిలింది. సుప్రభాతం. గంపలు ఎదురుచూస్తున్నాయి నింపమని." "దోసిలిపట్టి నిలుచున్న దిగంతం". అవును, దోసిలిపట్టి నిలుచున్నది పాఠకలోకం. "బ్రహ్మాండభాండానికి మూత" తీశారు, బంగారు కలలపై మూత "మాఘమాసపు వెన్నెల" లో "అడవి పక్షుల ఆగని సంభాషణ" లా మీ కవిత సాగుతోంది. మీరు యిక ఎవరి కవిత్వమూ చదవనవసరం లేదు. మొన్నటి "అరూప అనుగ్రహం" తెలుగు కవితలో ఒక కొత్త శిఖరం. బోద్ లేర్ "సంవాదాల" (Correspondances) సరసన చేరిపోయింది. "అగ్నికిరీటపు ధగధగలు అండర్ గ్రౌండ్లో కూడా ఆరిపోయినపుడే కవిత పుడుతుంది. అటువంటి కవిత యిటీవల "ప్రభాతకాంతిని" అద్దుకొని ఆవిర్భవిస్తోంది. తెలుగు కవిత్వంలో ఒక కొత్త అధ్యాయంగా, సమష్టిచైతన్యం తన చైతన్యంగా."