KOLLONTAI 150

Editor · Politics

KOLLONTAI 150 book cover

Price: Rs. 90. అలెగ్జాండ్రా కొల్లంతాయ్ (31 మార్చి 1872- 9 మార్చి 1952) ఒక కమ్యూనిస్టు విప్లవకారిణి. ఆధునిక రాజ్యాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలలో భాగస్వామి అయిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ. ఆమె బోల్షివిక్ పార్టీలో కార్మిక ప్రతిపక్షాన్ని నిర్వహించారు. ప్రేను, లైంగిక సంబంధాలపై ఆమె ఒక సిద్ధాంతవేత్త. ఆమె దౌత్వవేత్త కూడ. అలెగ్జాండ్రా కొల్లంతాయ్ ఒక సంక్లిష్ట వారసత్వాన్ని విడి వెళ్ళారు. నిబద్ధతతో కూడిన ఆమె రాజకీయ కార్యాచరణ, సైద్ధాంతిక కృషి గురించి ఇప్పటికీ చాలమందికి అపరిచితం. కాని ఆమె రచనలు, ప్రత్యేకించి రష్యన్ విప్లవ తొలిసంవత్సరాలలో రాసినవి, జెండర్, వర్గం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గదర్శిగా పనిచేస్తాయి. నూతన ఆలోచనలను ఆవిష్కరింప చేస్తాయి. అవి ఎంతో ఆధునికమైనవిగాను, కచ్చితమైనవిగాను ఉండి నేటికీ వర్తించేవిగా ఉంటాయి. -

Browse more Telugu books