Kavyathma

Editor · Caste, Religion & Culture

Kavyathma book cover

Price: Rs. 65. రాఘవయ్యంగారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో, 1890లో జన్మించారు వెంకటాచార్యులు, వెంకట నరసమ్మగారలు వీరి తల్లిదండ్రులు. టైలరు హైస్కూల్లో వీరూ అయ్యంకి వెంకటరమణయ్యగారూ సహాధ్యాయులు. విజయవాడ S.K.P.V. హైస్కూల్లో ఆధ్యాపకులుగా పనిచేశారు. ఇతర రచనలు - సుశీల, సత్యవతి, నృసింహ నిర్యాణము. ★ * "కొరతపడిన భాగమును పూర్తి చేయుటయే భాషా సేవకునకు పరమ కర్తవ్యము.” “శ్రీ రాఘవయ్యంగారీ కర్తవ్య నిర్వహణమున కుత్స హించినారు. ఫలముగ ప్రకృతమయిన యీ 'కావ్యాత్మ' 'భరతముని చంద్రుని నాట్య శాస్త్ర రచనాకాలము మొదలు జగన్నాథ పండితుని రస గంగాధర రచనా సమయము వరకును కావ్యాత్మ విచార మేరీతి పెంపొందినదియు' చరిత్ర రూపముగ విమర్శ రూపముగ నీ గ్రంథమున లెస్స నిరూపింపబడినది. ಇದ್ದೆ పరమావశ్యకమయిన 'సంస్కృతాంధ్రాంగ్ల సారస్వత త్రయ సాహిత్య' ముప్పతిల్ల రచయిత యీ గ్రంథమును రచించి సారస్వత ప్రపంచమునకు క్రొంక్రొత్త వికాసమును గూర్చినాడు. ఇది యలంకారశాస్త్ర విమర్శ గ్రంథముగను, చరిత్ర గ్రంథముగను సహృదయాలంకారికుల సమాదరమునకు పాత్ర మగుననుటలో రచనలకు సందేహములేదు. ప్రాచీనాలంకారిక మతము లన్నియు నిందు సమగ్రముగ గోచరించును.

Browse more Telugu books