Kavita 2024

Anil Dani , Bandla Madhavarao / అనిల్ డాని ,బండ్ల మాధవరావు · Novels

Kavita 2024 book cover

Price: Rs. 180. మహాప్రస్థానం 75 ఏళ్ల పండుగ సందర్భంలో మిత్రుడు సీతారాం ఒక మాట అన్నాడు. 'మహాప్రస్థానం' తెలుగుజాతికి ఒక జాతీయ వారసత్వ సంపద లాంటిది, దాన్ని కాపాడుకోవడం మాత్రమే కాక ముందు తరతరాలకు అందించాల్సిన బాధ్యత తెలుగువారికి, మరి ముఖ్యంగా ఈనాటి యువతరానికి ఉందన్నాడు. 'మహాప్రస్థానం' ప్రభావం ఆనాటి నుంచి ఈనాటి వరకు సాహిత్య సృజనశీలురు అందరిపై ఉందనటంలో ఎటువంటి సందేహం లేదనడానికి గత 20 ఏళ్లుగా వెలువడుతున్న కవిత సంవత్సరిక సంచికలలోని కవిత్వమే ప్రబల నిదర్శనం. "చరిత్రహీనులం కాదు మేము చరిత్ర నిర్మాతలం/ ఏదో ఒక రోజు మా నేల, కాదు కాదు మన ఈనేల కల ఫలిస్తుంది" అని పాపినేని శివశంకర్ అన్నా. "పొద్దుపొడుపు సమయంలో వాడు బయటకు రాడు/అరుణ కాంతి తనకు పడదు/ చీకటికి అలవాటు పడ్డ కళ్ళు వెలుగును చూడలేవు కదా/ ఎరుపును నిషేధించిన వాడి జీవితానికి ఉదయాలు ఎలా వస్తాయి" అని గంటేడ గౌరునాయుడు అన్నా, "నాటకానికి తెరపడింది/ తనని తాకడానికి/ నామర్ధా పడే చేతిని/ మట్టి గల్లా పట్టుకుని నిలదీస్తోంది / నీ మాటలో తడి శాతం ఎంతో చెప్పమని" అని చల్లపల్లి స్వరూప రాణి అన్నా, ఈ భావజాలానికి, ఈ కళ్ళు ఎరుపెక్కడానికి, ఈ చొక్కా పట్టుకొని నిలదీయడానికి ఆద్యుడు శ్రీశ్రీ. ఆకాశపు దారులంట హడావిడిగా వెళ్లిపోతున్న జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టించి భూకంపం పుట్టించినవాడు శ్రీశ్రీ. 75 సంవత్సరాలుగా మహాప్రస్థానం తెలుగుజాతి మీద, తెలుగు రాతమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆ ప్రభావంతో వెలుగుతున్న తెలుగు కవిత్వ కాగడాను, ముందు తరాలకు చేరవేసే బాధ్యతను, బాధ్యతాయుతంగా నెరవేరుస్తున్న విజయవాడ సాహితీ మిత్రులు. అందులో భాగంగానే కవిత 21వ వార్షిక సంచిక ఇప్పుడు మీ చేతుల్లో.

Browse more Telugu books