Katikapulu

Editor · Novels

Katikapulu book cover

Price: Rs. 90. పెత్తనం.... బ్రతుకుమీద పెత్తనం, తిండిమీద పెత్తనం, కట్టుమీద పెత్తనం, భాషమీద పెత్తనం, యాసమీద పెత్తనం... అధికార హోదాలూ వాడివే, అక్షర పీఠాలూ వాడివే పాట వాడిదే,ఆట వాడిదే... కళ నిండా నీబ్రతుకు... కళాకారుడు మాత్రం వాడే ... నీ ఘోష చెప్పాలన్నా వాడి ప్రాపకం కావాలి, నీ కన్నీళ్ళు రాలాలన్నా వాడి కనుసన్న తప్పనిసరి. నెత్తురు మరిగి ఒక నినాదం చెయ్యాలన్నా, కడుపుమండి ఓ తప్పెట దరువెయ్యాలన్నా నియమాలు లేని నీ వేదిక ఒకటి ఇప్పుడు కావాలి. చిందెయ్యడానికి చిర్రాకోలా కణకణలాడించడానికో నీదంటూ ఒక సావిడి కావాలి. వెలివాడ... ఇది నీ నట్టిల్లు! ఒకడి అనుమతీ అభిప్రాయం అస్సలు అవసరంలేని నీ నులకమంచం! వివక్షల చలిరాత్రులనుండి నిన్ను వెచ్చగా కౌగిలించుకునే రాతల నెగడు! వూరికి దూరంగా సాగుతున్న నీ డొంక నడకలో నీ భుజంమీద గర్వంగా కప్పుకున్న నల్ల గొంగడి! ఇది కంచికచెర్ల కోటేసు ఆర్తనాదం, ఇది కారంచేడు అన్నల ధిక్కారం, ఇది చుండూరు అయ్యల రుధిర క్షేత్రం!!! ఇది మద్దికెర మార్తమ్మ, ప్రియాంకా భోట్మాంగేల రుధిర దేహాల మాటున దాగిన గాయాల గేయం. రా.... నీకు నచ్చింది రాయి! ఇది సాహిత్యమో కాదో నిర్ణయించేవాడికి ఎడమ పాదంతో అభివాదం చేస్తూ నీ కథ రాయి! మీ అమ్మల కమ్మటి ప్రేమను రాయి, మీ అయ్యల గిడసబారిన కండల కరుకును రాయి! నీ గోడును రాయి.... ఒక పాటను రాయి, ఒక పల్లవి రాయి, గుర్తొచ్చిన ఒక పిల్లకాలపు ముచ్చట రాయి.... కాలవ గట్టుమీదో, గొడ్ల సావిడికాడో గుండెపగిలిన నీ అంటరాని ప్రేమ కథ ... ! - ఇండస్ మార్టిన్

Browse more Telugu books