Kathalu leni Kaalam
ఓల్గా / Volga · Stories & Poetry

Price: Rs. 70. మట్టంతా ప్రాణమయమేనమ్మా! మన కంటికి కనిపించేవి. కనిపించనివి ఎన్నో జీవరాసులు ఈ మట్టిలో పుట్టి పెరిగి చచ్చిపోతున్నాయి. అదే భూసారం. ఆ ప్రాణాలు లేకపోతే ఈ మట్టికి అర్థం లేదు. ఈ మట్టి లేకపోతే ఆ ప్రాణులే లేవు. ఆ పరస్పరాధారం ఉందే, అదే ఈ మొత్తం సృష్టిలో గొప్ప అద్భుతం. మనమూ దాంట్లో భాగమే. అది లేకపోతే మనం లేం. మనం బాగుండాలంటే మట్టి బాగుండాలి. మట్టి లోపల పుట్టే జీవులన్నీ బాగుండాలి. మనిషంటే మట్టే- మట్టిలో లేనిది, మట్టి కానిది ఏమీ లేదు మనిషిలో. అందుకే మట్టితో సావాసం చేయాలి". మట్టి చేతిలోకి తీసుకుని అనన్య చిట్టి చేతుల్లో పోస్తూ చెప్పేవాడు. "ఎంత సారం ఉందో చూడు - ఈ సారాన్ని పోగొట్టుకుంటే తిరిగిరాదు. భూసారం, కాలం, ప్రాణం ఇవి ఒకసారి పోతే తిరిగిరావు". - కథలు లేని కాలం