KataKatala Venaka
Editor · New Arrivals

Price: Rs. 369. మీరు 1.000 రూపాయలు దొంగిలించండి, కానిస్టేబుల్ మిమ్మల్ని కొట్టి, బల్బు, వెంటిలేషన్ లేని చీకటి కొట్టు లాంటి జైలు గదిలో పడేస్తాడు. మీరు 55,000 కోట్ల రూపాయలను దొంగలిస్తే, నాలుగు భాగాలుగా విభజించిన 40 అడుగుల సెల్లో ఉంచుతారు. దీనిలో ఇంటర్నెట్, ఫ్యాక్స్, మొబైల్ ఫోన్లు వంటి సౌకర్యాలతో పాటు, మీ బూట్లు శుభ్రం చేయడానికి వంట వండడానికి (అదీ ఆ రోజు స్టార్ హోటల్ హయత్ నుండి భోజనం రాకపోతే) ఇలా మీ పనులు చేయడానికి ఓ పదిమంది సిబ్బంది ఉంటారు. జైలు ఒక గొప్ప లెవలర్(సమతావాది) అని అంటారు-కానీ, భారతీయ జైలులో వీఐపీ ఖైదీలకి ఈ మాట వర్తిస్తుందా? వర్తించకపోవచ్చు. భారతదేశంలో ఖైదీలుగా శిక్షణ అనుభవించిన ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన ఫస్ట్-హ్యాండ్ ఇంటర్వ్యూల ఆధారంగా, అవార్డు గెలుచుకున్న జర్నలిస్ట్ సునేత్ర చౌదరీ, విఐపిల జైలు జీవితాల్నిచూపిస్తారు. పీటర్ ముఖర్జీయా రోజంతా తన 4 x 4 సెల్లో ఏమి చేశాడు? డూన్ పాఠశాలలోచదువుకొని 7 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్న 70ఏళ్ల వ్యక్తి తన కేసులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్లు వేసి ఏ విధంగా పోరాటం సాగిస్తున్నారు? ఆ నాలుగు రోజులలో అమర్ సింగ్ను చూడడానికి ఎవరు వచ్చారు. భవిష్యత్తులో స్నేహితులుగా ఎంతమంది మిగిలేరు? మొట్టమొదటిసారిగా, భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఖైదీలు, భయంకరమైన 'బ్లేడ్ బాజ్' నుండి టార్చర్ ఛాంబర్ల వరకు, సెల్లోని ఎయిర్ కండిషనర్ల నుండి ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి ఆహారం వరకు, మెత్తని పడకల నుండి ప్రైవేటు పార్టీల వరకు .జైలు జీవితాన్ని (జైలు ఆశ్రమం అన్నారు కొందరు) ఎలా గడుపుతున్నారో తెలియజేశారు. అనూహ్యంగా ఉన్న జైలు లోపల పరిస్థితులతో పాటు, అండర్ ట్రయల్స్ గా జైళ్లలో మగ్గుతున్న వందలాది దుస్థితి గురించి, ఖైదుచేయడం యొక్క ప్రాథమిక ఉద్దేశాన్ని ప్రశ్నిస్తుంది ఈ పుస్తకం. ఖైదు చేయడంలోని లక్ష్యం సంస్కరణ లో భాగమా లేదా ఈ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో భాగమా?