Kashtapadi Chadavoddu... Ishtapadi Chadavandi

డా॥ బి.వి.పట్టాభిరామ్ / Dr. B.V. Pattabhiram · Education & Science

Kashtapadi Chadavoddu... Ishtapadi Chadavandi book cover

Price: Rs. 95. డా|| బి.వి.పట్టాభిరామ్ అంతర్జాతీయంగా పేరుపొందిన హిప్నాటిస్టు. మెజీషియన్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్, వీరు ఉస్మానియా యూనివర్సిటీ నుండి 'యోగ-హిప్నాటిజం' అనే అంశంపై పి.హెచ్.డి. డిగ్రీ పొందారు. హిప్నాటిజంపై భారతదేశంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా॥ పట్టాభిరామ్. గైడెన్స్ & కౌన్సిలింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తిచేసి హైదరాబాద్లో ప్రశాంతి కౌన్సిలింగ్ & హెచ్.ఆర్.డి. సెంటర్ ద్వారా కౌన్సిలర్గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రయినర్గా సేవలందిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, మలేసియా, థాయ్లాండ్ మొదలైన దేశాలలో వర్క్షాప్లు నిర్వహించారు. వీరు రచించిన "జీనియస్ మీరుకూడా" పుస్తకం అత్యధిక పాఠకాదరణ పొంది వేలాదిమంది విద్యార్థులకు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో ఉపయోగపడింది. దేశంలోని అనేక విద్యాలయాల్లో వీరు విద్యార్థులను ప్రేరేపిస్తూ వారికి స్టడీస్కిల్స్ గురించి వివరిస్తూ పర్యటించారు. పత్రిక, టీవీ మాధ్యమాల ద్వారా, వ్యక్తిగత పర్యటనలతోను లక్షలాదిమంది విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తున్న డా॥ పట్టాభిరామ్ వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు వ్యక్తం చేసిన అనేక సందేహాలను తీర్చటంకోసం, విద్యార్థుల భవితవ్యాన్ని ప్రభావితంచేయగల అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని మీకు అందిస్తున్నారు.

Browse more Telugu books