Karma - Janma

Malladi Venkata Krishna Murthy · Novels

Karma - Janma book cover

Price: Rs. 99. మల్లాది వెంకట కృష్ణమూర్తి త్వరగా పెరిగే ఓ లత ఓ కొబ్బరిచెట్టు కాండాన్ని అల్లుకుని, అ కొబ్బరిచెట్టుతో గర్వంగా చెప్పింది. "నేనెంత త్వరగా పెరిగి నిన్ను అల్లుకున్నానో చూడు. మరి నువ్వో? ఈలోగా నువ్వో అంగుళం కూడా పెరగలేదు." అ కొబ్బరి చెట్టు చిన్నగా నవ్వి జవాబు చెప్పింది. "వేలకొద్దీ లతలు నాతో ఇదే మాటన్నాయి. గాలి తాకిడికి అవన్నీ వెళ్ళిపోయాయి. నేను మాత్రం బలంగా ఇక్కడే ఉన్నాను." హిందూ ననాతనధర్మం ఆ కొబ్బరిచెట్టు లాంటిది. అలాంటి హిందుమతానికి మూలస్థంభాలైన కర్మ-జన్మల గురించి వివరించే పుస్తకం ఇది. కర్మంటే ఏమిటి?, కర్మఫలం ఎప్పుడు, ఎలా లభిస్తుంది? ఏ కర్మ ఫలితాన్నిస్తుంది? కర్మఫలాన్ని అనుభవించకుండా ముందుగానే దాన్ని నాశనం చేసుకోవడం ఎలా? లాంటి కర్మకి చెందిన ఎన్నో విశేషాలని ఈ పుస్తకంలో చదవచ్చు. తెలుగులో కర్మసిద్ధాంతాన్ని సమగ్రంగా వివరించే పుస్తకం కర్మ-జన్మ. గమనిక: 2023లో మరికొంత అదనపు సమాచారాన్ని, ప్రొఫెట్ రీడింగ్స్ ని జోడించి వెలువరించిన రివైజ్డ్ పుస్తకం ఇది.

Browse more Telugu books