Karl Marx Adhanapu Viluva Siddanthalu ('petubadi' nalgava samputi ) volume -1
Editor · Politics

Price: Rs. 520. కార్ల్ మార్క్స్ 1861–63 మధ్య "అదనపు విలువ సిద్ధాంతాలు" రాశాడు. దీనిలోని సారాంశాన్ని "పెట్టుబడి-1,2,3"ల్లోని పాదసూచికల్లోనూ, ప్రధాన భాగంలో కొన్ని చోట్ల మార్క్స్ పొందుపరచాడు. " పెట్టుబడి" మొత్తం గ్రంథపు చారిత్రక, విమర్శనాత్మక భాగమంతా మూడు భాగాల్లో వుండే ఈ *" అవిసి||'ల్లో ఉంటుంది. ప్రస్తుతం మొదటి భాగం మీ చేతుల్లో ఉంది. అనువాదకుడు ఈ గ్రంథంలో శ్రమ, శ్రమ-శక్తి, విలువ, అదనపు-విలువ, ఉత్పాదకత, వై.వి. రమణారావు ఉత్పాదక, అనుత్పాదక శ్రమలు, శ్రామికులు', క్వెస్నే ఆర్థిక పట్టిక, ఫిజియో- విశ్రాంత ఉద్యోగి క్రసీ, వర్తక వ్యవస్థ, 'భూమి-అద్దె, వడ్డీ'ల మూలాలు, పెట్టుబడిదారుడు, భూస్వామి. సరుకుల చలామణీ, స్మిత్ చేసిన సరైన, తప్పు నిర్ధారణలూ, గందరగోళాలూ ఉంటాయి. 'విలువ' అంటే ఏమిటో తెల్పుకోటానికి ఫిజియోక్రాట్ల నుండి బయల్దేరిన ఎంతోమంది ఆర్థికవేత్తలు (రికార్డోతో సహా) అదేమిటో స్పష్టపడకుండానే 'అదనపు- విలువ' గురించి తీసిన నిర్ధారణల్ని, చేసిన సిద్ధాంత రచనల్ని, ఒకరి రచనల వక్రీకరణల్ని అనువాదాల్లో) ఎన్నో చారిత్రక విషయాల ఆధారాలతో మార్క్స్ మనకందించాడు. ఈ గ్రంథంలో మరో ప్రధాన విషయం 'ఏ శ్రమ ఉత్పాదకమైనది, ఏది కాదు' అనే అంశంపై వందల ఏళ్ళుగా ఆర్థికవేత్తలు, ఇతర వృత్తులవారు సైతం ఎలా ప్రారంభమై, గందరగోళాల మధ్యనే ఎక్కడికి పురోగమించారనేదాన్ని మార్క్స్ వారి రచనల్నుండే ఉదహరిస్తూ విమర్శించటం, విశ్లేషించటం, ఆ తర్వాత 'ఏది పెట్టుబడి, ఏది ఆదాయం' అనే విషయాలూ, అదనపు- విలువ ఎలా లాభంగా అనుకోబడిందీ చెప్పిన తర్వాత మార్క్స్, పెట్టుబడితో ఆదాయానికి, ఆదాయంతో ఆదాయానికి జరిగే మారకాన్నీ, అలా చలామణీ అంశాన్నీ ఉదాహరణలతో ఎంతో విస్తారంగా వివరిస్తాడు. ఇక, అదనపు-విలువ, శ్రమ గురించి, శ్రమ దోపిడీ, కార్మికుని వ్యధల్నీ, దుస్థితినీ చెప్పిన కొద్దిమంది ఆర్థికవేత్తలను (ప్రధానంగా లింగ్వెట్ను) మార్క్స్ విమర్శిస్తూ, వారి మొసలి కన్నీరు వెనుక గల సంస్కరణా దృష్టినీ, వారి వర్గ స్వభావాన్నీ వారి రచనల్లోనుండే బయల్పరుస్తాడు. ప్రధాన భాగానికి ఇచ్చిన అనుబంధాలు ప్రధాన భాగంలో