Karamajov Sodharulu

అరుణ ప్రసాద్ / Aruna Prasad · Novels

Karamajov Sodharulu book cover

Price: Rs. 540. ఫ్యోదోర్ దొయేవ్స్క నవల "బ్రదర్స్ కరమజోవ్” తెలుగు అనువాదం "కరమజోవ్ సోదరులు" ప్రచురణ తెలుగుసాహిత్యంలో జరుగుతున్న గొప్ప చారిత్రక సంఘటన. 1880లో ఆ నవల మొదటిసారిగా రష్యాలో ప్రచురించబడినప్పుడూ, 1912లో ఆ నవలకు కాన్స్టెన్స్ గార్నెట్ చేసిన ఆంగ్లానువాదం యింగ్లాండులో ప్రచురించబడినప్పుడూ అవి ప్రపంచసాహిత్యంలో జరిగిన గొప్ప చారిత్రక సంఘటనలుగా నిరూపించబడ్డాయి. 19వ శతాబ్దంలో మాత్రమేగాకుండా నవలాచరిత్ర మొత్తంలోనూ అత్యంత వృత్కృష్టమైన నవలగానూ, ప్రపంచసాహిత్యాన్నంతా ప్రభావితంచేసిన అపురూపమైన నవలగానూ "బ్రదర్స్ కరమజోవ్" ను పాఠకులూ, విమర్శకులూ, రచయితలూ ముక్త కంఠంతో కొనియాడుతున్నారు. దాదాపు రెండు సంవత్సరాలకాలం యీ నవలా రచనలోనే మునిగిపోయిన దొస్తాయేవ్స్క అది ప్రచురించబడిన నాలుగు నెలల్లోపునే చనిపోయాడు. అది ఆయన చివరి రచన మాత్రమేగాదు, ఆయన మానవజాతికిచ్చిపోయిన వీడ్కోలు కానుక కూడా! ఆ నవలలో ఆయన తాను చెప్పదలచుకున్నదంతా యే మొహమాటలూ, మినహాయింపులూ, అరమరికలూ లేకుండా చెప్పేసి వెళ్లాడు. జీవితపు యెత్తుపల్లాలనంతా తనదైన విశిష్టమైన, నిశితమైన, నిర్మోహపు దృష్టితో తరచి చూసిన ఆ మహా రచయిత మనుషుల్నీ, జీవితాన్ని వాటి మంచిచెడ్డలతో బాటూ గొప్పగా ప్రేమించాడు. అంతగా ప్రేమించినవాడు మాత్రమే "బ్రదర్స్ కరమజోవ్" లాంటి మహత్తరమైన నవలను రాయగలడు. ఆ నవల అలా. రూపొందడం వెనక నేపధ్యంగా దొస్తాయేవ్స్క వంటి మానవుడి వైవిధ్యభరితమైన జీవితమూ, రష్యావంటి విశిష్టమైన మానవసమాజమూ వున్నాయి.

Browse more Telugu books